అమరచింత, అక్టోబర్ 6 : మూడేండ్ల వయస్సులోని రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోయి న అమరచింత పట్టణానికి చెందిన చిన్నారి సింధూజ తన తెలివి తేటలతో చిన్నతనంలోనే ఇండియా బుక్ ఆ ఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. అక్టోబర్ 2న హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ పాఠశాలల విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో పాల్గొన్న సింధూజ పాల్గొని 60 తెలుగు నెలల పేర్లను కేవలం 18 సెకన్లలో చెప్పేసింది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో విద్యార్థిని స్థానం దక్కించుకున్నట్లు న్యాయనిర్ణేతలు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థిని రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్, మం డల అధ్యక్షుడు వెంకటయ్య అభినందించారు. అయితే సింధూజ తల్లిదండ్రులు గోపి, కళావతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె అన్న విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో ఆమె అనాథగా మిగలగా అదే కాలనీకి చెందిన పలువురు సింధూజను కొత్తకోటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చేర్పించగా.. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నది.