బల్మూరు, అక్టోబర్ 3 : తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కు సీఎం కేసీఆర్‌తోనే గుర్తింపు వచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని తుమ్మెన్‌పేట గ్రామంలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంతంలో హరితహారంలో భాగంగా జమ్మిమొక్క ను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్యుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
సోమవారం మండలంలోని నర్సాయిపల్లి గేట్ వద్ద గ్రామస్తులు ఏర్పాటు చేసిన కమాన్(ముఖద్వారాన్ని) ఆయన ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ దేశ్యానాయక్ అధ్యక్షతన ఏర్పాటు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తులు పెద్దమనస్సుతో చందాలు వేసుకొని గ్రామ ముఖద్వారాన్ని నిర్మించుకోవడం గోప్పవిషయమన్నారు. ప్రతి గ్రామంలో దాతలు, ఆర్థికంగా ఉన్నవారు ముందుకు వస్తేనే గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందుతాయన్నారు. అంతకుముందు మండలకేంద్రంలో సీనియర్ జర్నలిస్టు అనంత రవీందర్‌రెడ్డి మృతి చెందడంతో ఎమ్మెల్యే మృతుడి ఇంటికి వెళ్లి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, జర్నలిస్టులు తదితరులు మృతుడి కుటుంబా న్ని పరామర్శించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ నర్సయ్య, తాసిల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీవో దేవన్న, డీఈ బాష్యూనాయక్, సర్పంచులు సహదేవు, శివశంకర్, నాయకులు నాగ య్య, శంకర్‌నాయక్, కృష్ణ, రాజు, బల్‌రాంనాయక్, వెంకట్రాం, రవి, శ్రీను, లక్ష్మణ్, హరిశంకర్, ఆర్యవైశ్య మండలాధ్యక్షు డు వెంకటేశ్వర్లు, గ్రామాధ్యక్షుడు రాఘవేందర్, ఎంపీటీ సీ సురేందర్, మాజీ ఎంపీపీ కరుణాకర్‌రావు, నాయకులు శ్రీ నివాసులు, పాండయ్య, నరేశ్, రవి, రాజు, శ్రీనివాసు లు, చంద్రయ్య, మధు, భానుప్రతాప్, బాలస్వామి, సతీశ్, రఘనందన్, తిరుపతయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.