రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగుళాంబ,బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో, రకరకాల పుష్పాలతో అలంకరించారు. నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా భక్తులను కరుణించింది. శ్రీశైల క్షేత్రంలో భ్రామరీ అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శైలపుత్రి రూపంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. దేవి ద్విభుజాలు కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి వృషభ వాహనంపై దర్శనమిచ్చింది. భ్రామరీసహిత మల్లికార్జునుడు భృంగివాహనాన్ని అధిష్టించి భక్తులను కటాక్షించారు.
అలంపూర్, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహామంగళహారతి అ నంతరం ఆలయంలోకి భక్తులను అనుమతించారు. ప్ర త్యేక పూజలు చేశారు. ఉదయం పది గంటలకు యాగశాలలో చండీహోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం నవాన్న సహిత నివేదన సమర్పించారు. విరామం అనంతరం అమ్మవారి యాగశాల ప్రవేశం చేసి పూజలు జరిపించారు. సాయంత్రం 6:30 గంటలకు ధ్వజారోహణ, బలిహరణ గావించారు.
అనంతరం మహామంగళహారతి, దశవిధ హారతులు సమర్పించారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ ధర్మకర్తలు, అర్చకులతో కలిసి ఈవో పురేందర్‌కుమార్ అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో పట్టువస్ర్తాలు సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు జోగుళాంబ అమ్మవారు శైలపుత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో పద్మాన్ని ధరిం చి శైలపుత్రిగా దర్శనమిచ్చే అమ్మవారిని పూజిస్తే విజయోత్సాహం కలుగుతుందని భక్తుల నమ్మకం. శైలపు త్రి దేవికి కొలువు, కుమారి సువాసినీ పూజలు, మహా మంగళహారతి, నీరాజన మంత్రపుష్పములు గావించారు. రాత్రి 8:30కు ప్రసాద వితరణతో పూజా కార్యక్రమాలు ముగిశాయి.
శ్రీశైలం, సెప్టెంబర్ 26 : శ్రీశైల క్షేత్రంలో దసరా మ హోత్సవ వేడుకలకు సోమవారం అంకురార్పణ చే శారు. శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ఈవో లవన్న దంపతులు సో మవారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ఆలయ ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి, స్వామివారి ఆ లయంలో పూజలు చేసినట్లు ప్రధాన అర్చకులు భ ద్రయ్య, మార్కండేయ శర్మ తెలిపారు. రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం జరిపించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే భ్రామరీ అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శైలపుత్రి రూ పంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
అ మ్మవారు ద్విభుజాలు కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎ డమచేతిలో కమలం ధరించి వృషభ వాహనంపై దర్శనమిచ్చారు. సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజు అయి న హిమవంతుడికి పుత్రికగా జన్మించడంతో శైలపుత్రిగా పేరుగాంచింది. అనంతరం అక్క మహాదేవి అలంకార మండపంలో భ్రామరి సహిత మల్లికార్జునుడు భృంగివాహనాన్ని అధిష్టించి భక్తులను కటాక్షించారు. స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులను గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు విహరించారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వే షాలు, కేరళ వారి కథాకళి వేషాలు, తప్పెట చిందు, లం బాడీ నృత్యం, శంఖం, పిల్లనగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవ డోలు, కొమ్ము, నందికోలు సేవ మొదలగు వివి ధ రకాల విన్యాసాలతో ఆధ్యంతం కనులపండువగా సాగింది. కాగా, మంగళవారం అమ్మవారు బ్రహ్మచారి ణీ అలంకారంలో, స్వామివారు మయూరవాహన సేవ లో దర్శనమివ్వనున్నారని ఈవో లవన్న తెలిపారు. మహోత్సవానికి శ్రీశైలం పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్‌కుమార్, ఏఈవో మల్ల య్య, హరిదాసు, మోహన్, సెక్యూరిటీ అధికారి నర్సింహారెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.