దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 26 : దసరా పండుగ కానుకగా ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్‌లో సో మవారం మహిళలకు బతుకమ్మ చీరల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, స ర్పంచ్ కోట సుప్రియ, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు కోటరాము, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
జడ్చర్ల, సెప్టెంబర్ 26 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. మండలంలో ని బండమీదిపల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు సంతోషంగా పండుగలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభు త్వం ప్రతి ఏడాది బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కిట్లను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం మాల్యానాయక్, పంచాయతీ కార్యదర్శి పార్వతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నపల్లి శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్, జంగ య్య, పాండు, శ్రీను పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతే ప్ర భుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. పట్టణంలోని 2, 5, 17, 18, 38 వార్డుల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్లు వనజ, జంగ మ్మ, కిశోర్, బాలీశ్వరి, నాయకులు పా పారాయుడు, వెంకట్రాములు ఉన్నారు.
బాలానగర్, సెప్టెంబర్ 26 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జెడ్పీటీసీ కల్యాణి అన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లి, చింతకుంటతండాలో సోమవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను అందజేశారు. అలాగే పెద్దాయపల్లిలో సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి శంకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు రాంరెడ్డి, రేణుక, ఎంపీటీసీ స్నేహలత, టీఆర్ఎస్ మైనార్టీసెల్ మండల అధ్యక్షుడు జమీరుల్లా, లక్ష్మణ్‌నాయక్, నాగేందర్‌నాయక్, రాంలాల్, భాస్కర్, పంచాయతీ కార్యదర్శి పాండు పాల్గొన్నారు.