పాలమూరు, సెప్టెంబర్ 22 : తెలంగాణ రాష్ట్రంలో గ్రా మాల అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాల అమలుతీరు ప్రశంసనీయమని జమ్మూకశ్మీర్ రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం పేర్కొన్నది. జిల్లాలోని పలు గ్రామాల్లో రెండురోజులపాటు పర్యటించి అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాల అమలుతీరును తెలుసుకున్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ యాదయ్య జమ్మూకశ్మీర్ బృందానికి పుష్పగు చ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాలతోపాటు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో 8ఏండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి తదితర అం శాలను తెలియజేశారు. కేసీఆర్ ఎకో అర్బన్‌పార్కు 2097 ఎకరాల్లో ఉందని, ఇది దేశంలోనే పెద్దదని చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో పార్కును మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జమ్మూకశ్మీర్‌కు చెంది న జెడ్పీ చైర్మన్లు శిల్పాదూబే, అహ్మద్రుణ్యాల్, హకీమాబేగం, జహీద్ హమీ ద్, అసిస్టెంట్ కమిషనర్ సుర్జీత్అలీతోపాటు డీఎఫ్‌వో సత్యనారాయణ, డీపీవో వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో జ్యోతి, డిప్యూటీ సీఈవో మొగులప్ప, ఎఫ్ఆర్వో రాజశేఖర్ పాల్గొన్నారు.