ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మదనాపురం మండలంలో కలెక్టర్ షేక్‌యాస్మిన్‌బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆలతో కలిసి పర్యటించారు. శంకరమ్మపేట సరళాసాగర్ ప్రాజెక్టులో 8లక్షల చేపపిల్లలను వదిలారు. తిర్మలాయపల్లిలో 40డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవీఆర్ కాలనీ, రూ.3.35కోట్లతో కస్తూర్బాగాంధీ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
మదనాపురం, సెప్టెంబర్ 19 : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టులో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి 8 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. అనంతరం మదనాపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన వే బ్రిడ్జిని ప్రారంభించారు. తిర్మలాయపల్లిలో 40 డబుల్ బె డ్రూం ఇండ్లను, ఏవీఆర్ కాలనీ, నూతన కేజీబీవీ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం కేజీబీవీ ప్రాంగణం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. తెలంగాణ వచ్చాక అనేక గురుకుల పాఠశాలలను ప్రారంభించుకున్నామని, విద్యార్థు లు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. రూ.3.35 కోట్లతో కేజీబీవీ పాఠశాలను నిర్మించినట్లు చెప్పారు. విద్యార్థులకు కృష్ణ, కోయిల్‌సాగర్, కర్వెన రిజర్వాయర్లను చూపించి, వాటి సామర్థ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని డీఈవో రవీందర్‌ను ఆదేశించారు. కరోనాతో లక్ష కోట్లు నష్టపోయామని, ఇప్పుడిప్పుడే కోలుకొని దశల వారీగా అన్ని అభివృద్ధి పను లు చేపడుతున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని అ ద్భుతమైన సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, దేశం, ప్రపంచానికి ధాన్యం గింజలను మన రా ష్ట్రం నుంచే సరఫరా చేసేంత స్థితిలో ఉంటామని, ఇం దుకు యువత నడుం బిగించాలన్నారు. అనంతరం వి ద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబు చెప్పిన వారికి పారితోషికం అందజేశారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి మా ట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన మండలానికి కొత్త పా ఠశాల రావడం అదృష్టమని, విద్యార్థులు మంచిగా చ దివి కన్నవారికి, ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ 228 మం ది విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన కేజీబీవీ భవనా న్ని నిర్మించామన్నారు. త్వరలోనే అడ్డాకుల మండలం లో కేజీబీవీ ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మన ఊరు-మన బడికి రూ.7,300 కోట్లు కేటాయించామన్నారు. సీఎం కేసీఆ ర్ ఆశీర్వాదంతో నియోజకవర్గానికి 2 మైనార్టీ, 2 ఎస్సీ, 2 బీసీ గురుకులాలను తీసుకొచ్చామన్నారు. అతి త్వర లో డిగ్రీ కళాశాలను తీసుకురానున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’తో అనేక పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. కేజీబీవీలో నీటి సంపును ఏర్పాటు చేయాలని కోరగా.. కలెక్టర్ సానుకూలంగా స్పందించి రూ.5 లక్షలు కేటాయించి, పనులు త్వరగా పూర్తి చే యాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, యూత్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు అనురాధ, ప్రధాన కార్యదర్శి మాసన్న, ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సర్పంచు లు రాంనారాయణ, కురుమూర్తి, శారద, పద్మ, శ్రావ ణి, శ్రీనివాసులు, శివశంకర్, ఎంపీటీసీలు కురుమ య్య, సరస్వతి, శాంతమ్మ, నాయకులు వెంకట్‌నారాయణ, గోపీస్వామి, రాములు, హనుమాన్‌రావు, చాం ద్‌పాషా, కుర్మన్న, నాగన్నయాదవ్, బాలకృష్ణ, కుమా ర్, చంద్రయ్య, అచ్యుతారెడ్డి, మహేశ్, పెంటయ్య, గోవర్ధన్, మురళి తదితరులు పాల్గొన్నారు.