కోయిలకొండ, సెప్టెంబర్ 19 : అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సోమవారం 200మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 100మంది ఆసరా లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆచార్యాపూర్లో విద్యుదాఘాతంతో మృతి చెందిన పశువులకు విద్యుత్‌శాఖ నుంచి మంజూరైన నష్టపరిహారం చెక్కులను సంబంధిత రైతులకు అందజేశారు. అలాగే పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం దమ్మాయపల్లి, మల్కాపూ ర్ చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు, వృద్ధులకు రూ.2016 పింఛన్‌లాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్నివర్గాల వారు అభివృద్ధి చెందుతున్నారని అన్నా రు. మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయడంతోపాటు సబ్సిడీపై వాహనాలను అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 52 చెరువుల్లో 6లక్షల 35వేల చేపపిల్లలను వదలనున్నట్లు చెప్పా రు.
అలాగే గిరిజనుల సంక్షేమానికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు గిరిజనబంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్ణణీయమన్నారు. తెలంగాణ వచ్చాకే గిరిజనులు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. తండాలను పంచాయతీలుగా ఏర్పా టు చేసి అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరలోనే పూర్తిచేసి మండలానికి సాగునీరు అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సింగిల్విం డో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, సర్పంచులు కృష్ణయ్య, మాధవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాము, హన్మంతు, నారాయణ, ఆంజనేయులు, ఎంపీటీసీలు ఆంజనేయులు, విజయలక్ష్మి, నిరూపమరాణి, రోజా, తాసిల్దార్ ప్రేంరాజ్, ఎంపీడీవో జయరాం, మత్య్సశాఖ ఏడీ రాధికారాణి, ఫీల్డ్ అధికారి నవీ న్, రాజేంద్రప్రసాద్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నాగయ్య, రాజవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్, బాలయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.