మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19 : గిరిజనుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని గిరిజన నా యకులు అన్నారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు గిరిజనబంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంబురా లు నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిరిజనుల ఆత్మగౌర వం పెంచేలా హైదరాబాద్‌లో బంజారాభవన్ నిర్మించి ప్రా రంభించడం సంతోషంగా ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు గిరిజనబం ధు అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి చంద్రానాయక్, కౌన్సిలర్ మోతీలాల్, నాయకులు ప్రతాప్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, రమేశ్‌నాయక్, హరిశ్చందర్నాయక్, రాజేశ్‌నాయక్, లక్ష్మణ్, రవీందర్‌నాయక్, పురందాస్, నగేశ్, రమేశ్ పాల్గొన్నారు.
రాజాపూర్, సెప్టెంబర్ 19 : గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు గిరిజనబంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, యూ త్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు రమేశ్‌నాయక్, గోవింద్‌నాయక్, నర్సింహానాయక్, వెంకటయ్యగౌడ్, హతీ రాం, విజయ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 19 : గిరిజనులకు 10శాతం రి జర్వేషన్లు కల్పించడంతోపాటు గిరిజనబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై గిరిజన నాయకులు మండలకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు కృష్ణయ్య, చక్రవర్తి ఎంపీటీసీలు ఆంజనేయు లు, మణెమ్మ, నాయకులు రాజేంద్రప్రసాద్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, మాధవులు, శ్రీధర్కిశోర్, వాసు, రమేశ్, కృష్ణ, వస్యా, రామూనాయక్ పాల్గొన్నారు.