మహౠబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 18 : వెదురుతో ప్రకృతికి, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మిగితా అన్ని వృక్షాల కన్నా వెదురు పెద్ద మొత్తంలో కార్బన్‌డై ఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సీజన్‌ను అందిస్తుందన్నారు. ఆదివారం మహౠబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం సమీపంలో జిల్లా మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ ప్రపంచ వెదురు దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2009 నుంచి సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెదురు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం, పెంపకంపై అవగాహన కల్పించేందుకే ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగపడుతుందన్నారు. కొందరు కుట్రలతో వీటిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కులవృతులను కాపాడడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. హరితహారంలో దేశంలోనే అత్యధికంగా వెదురు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
స్థానికంగా 10 ఎకరాల్లో త్వరగా చేతికొచ్చే హైబ్రిడ్ రకం వెదురు మొక్కలను వర్షాకాలం పూర్తయ్యేలోగా నాటాలని అధికారులను ఆదేశించారు. వెదురుతో స్థానిక ఆధారిత ఉత్పత్తులను తయరు చేసే ఉపయోగం ఉంటుందన్నారు. మినీ శిల్పారామంలో వెదురు ఉత్పత్తుల కోసం స్టాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లామేదర సంఘం భవనం ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మేదరులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, జిల్లా అటవీ శాఖాధికారి సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షబ్బీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరాములు, జిల్లా అధ్యక్షుడు చిట్యాల రాములు, ఆంజనేయులు, శివరాజు, సుధాకర్, మహేంద్ర సంఘం నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.