మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 14 : క్రీడలతోపాటు అన్ని రంగాల్లో మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో నిలవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న మహబూబ్‌నగర్ క్రికెట్ సంఘం(ఎండీసీఏ) మైదానంలో ప్రాక్టీస్ నెట్స్, టర్ఫ్ వికెట్, బౌలింగ్ మెషిన్స్ను ప్రారంభించగా.. క్రీడాకారుల కోసం రూ.10 లక్షలతో చేపట్టనున్న డ్రైస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో కేం ద్రంలో రూ.7 కోట్లతో ఇండోర్ స్టేడియం పనులు జరుగుతున్నాయన్నారు. రూ.2.50 కోట్లతో ప్ర ధాన స్టేడియం ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.
ఎం వీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2.65 కోట్ల తో స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాలు ర కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చే స్తున్నారని స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్లు పంపిణీ చేశామన్నారు. జిల్లా క్రికెట్ సంఘం కృషిని అభినందించారు. గ్రామీణ క్రీడాకారులను క్రికెట్ సం ఘం ప్రోత్సహించాలని, మైదానాల్లో పోటీలు ని ర్వహించాలని సూచించారు. జిల్లాకు పేరు తెచ్చే వారికి అండగా ఉంటామన్నారు. కామన్వెల్త్ క్రీడ ల్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచారని గుర్తుచేశారు. జిల్లా క్రీడాకారులు రంజీ, జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో 7,500 క్రీడాప్రాంగణాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో నేడు శరవేగంగా ప్రగతి పరుగులు పెడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చై ర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, డీఎస్పీ మహేశ్, లిటిల్ స్కాలర్స్ కరస్పాండెంట్ విధూషిరాయ్, కౌన్సిలర్ జంగమ్మ, క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సురేశ్, వెంకటరామారావు, గోపాలకృష్ణ, కృష్ణమూర్తి, కోచ్ అబ్దుల్లా, నాయకులు పాపారాయుడు, మోతీలాల్, ఖాజాపాషా, ప్రశాంత్ పాల్గొన్నారు.
పాలమూరు, సెప్టెంబర్ 14 : విద్యార్థులకు ఇంటర్ విద్య చాలా కీలమకమైదని, సమయం వృథా చేయకుండా కష్టపడి చదివితే జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరుకోవచ్చని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వాగ్ధేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫ్రెషర్స్ డే నిర్వహించారు. అనంతరం ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను మంత్రి సన్మానించారు.