మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడితే జాతీయ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కుతుందని ఉమ్మడి జిల్లా సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. ఎనిమిదేండ్లలో పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి, చౌకధర దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తదితర కార్యక్రమాల్లో తమకు భాగస్వామ్యం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లెప్రగతితో మౌలిక వసతులు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగ్రేషన్ షెడ్డు, గ్రామీణ క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పల్లెలు ఆహ్లాదాన్ని సంతరించుకున్నాయి.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ, పాఠశాల భవనాలతో పల్లెసీమలు కళకళలాడుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభంలో తమకు సముచిత స్థానం ఇస్తున్నారని, ఇది కేసీఆర్ చలవేనని సర్పంచులు పేర్కొంటున్నారు. అనేక తండాలు, చిన్న చిన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్ దేశ్‌కీ నేత అంటూ కొనియాడుతున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం చారిత్రాత్మకమని, తామంతా మూకుమ్మడిగా స్వాగతిస్తున్నామని అంటున్నారు. ఉత్సవ విగ్రహాలుగా ఉండే పరిస్థితి నుంచి అభివృద్ధిలో పోటీపడే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. అనేక కార్యక్రమాలను సర్పంచ్‌లు తీర్మానాలు చేసి నిధులు వినియోగించుకుంటున్నారు. దీంతో అనేక అభివృదద్ధి కార్యక్రమాలు ఆటంకం లేకుండా సాగుతున్నాయి. ఇంతటి గణనీయమైన అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే దేశ భవిష్యత్ మారుతుందని సర్పంచులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృ ష్టి సారించి తెలంగాణను అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని కూడా డెవలప్ చేస్తాడ న్న నమ్మకం ఉన్నది. ఇది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మోదీ సర్కార్ పెట్రోలు, డీజిల్‌తోపాటు నిత్యావసర సరుకుల ధరలను అమాం తం పెంచి అన్ని వర్గాల నడ్డీ విరుస్తున్న ది. ఈ తరుణంలో కేసీఆర్ తప్పనిసరిగా జాతీయ పార్టీ పెట్టాలి.
– భాగ్యమ్మ, సర్పంచ్, నాగుదేవ్పల్లి, తాడూరు
జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఆవశ్యకత ఎంతో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం కూడా అభివృద్ధి చెందాలం టే సరైన మార్గ నిర్దేశం చేసే నాయకుడు కావాలి. అటువంటి లక్షణాలు కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నాయకులను కూడగట్టి జాతీయ శక్తిగా మారే శక్తి, యుక్తి కేసీఆర్‌లో ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి రాణించగలడు. కేసీఆర్ పీఎం కావడం ఖాయం.
– అతినారపు విష్ణు, అనంతసాగర్ సర్పంచ్, తెలకపల్లి
దేశ రాజకీయాల్లో సత్తా చాటే బలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. దేశాన్ని ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ చేసిందేమీ లేదు. కేసీఆర్ సర్కార్ సంక్షేమ పథకాల తో ప్రజలను ఆకట్టుకుంటున్నది. దేశప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే మంచి ఫలితం ఉంటుంది. రాష్ట్రంలోని సంక్షేమాలను దేశ వ్యాప్తంగా అమలు చేసే దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి మన సీఎం కేసీఆర్ ఒక్కడే.
– చెన్నరాయుడు, సర్పంచ్, తుమ్మలపల్లి, గట్టు
కేంద్ర సర్కార్ తెలంగాణపై వివక్ష చూపుతున్నది. చిన్న రాష్ర్టాలకు అన్యా యం చేస్తున్నది. ఎన్నికల ముందు ఎ న్నో హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నల్లధనా న్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి మాట తప్పింది. తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి ఎనిమిదేండ్లలో అనేక సం క్షేమ కార్యక్రమాలు చేపట్టి, వాగ్దానాలు ఇవ్వని స్కీంలకు కూడా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. అలాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో వస్తే దేశ భవిష్యత్ మారుతుందన్న నమ్మకం ఉన్నది.
– పూర్యానాయక్, సర్పంచ్, భవానిగడ్డ తండా, మహబూబ్‌నగర్ రూరల్
సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రా జకీయాల్లోకి వస్తే తెలంగా ణ జాతి మొత్తం గర్విస్తుం ది. అన్ని వర్గాలకూ సమన్యాయం చేసిన వ్యక్తి కేసీఆ ర్. మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి ఫలాలు అం దించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గుజరాత్‌ను రోల్‌మోడల్‌గా చూపి మోదీ ప్రధాని అవ్వగా లేనిది.. అంతకంటే ఎక్కువ అభివృ ద్ధి చేసి చూపించిన కేసీఆర్ ప్రధాని అయితే తప్పేంటి. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నది.
తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి చే యాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ జాతీ య రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయం. 14 ఏండ్లు నిరంతరం పోరాటం చేసి ప్రత్యేక రా ష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తు న్న నాయకుడు కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చే స్తున్న కేసీఆర్ అదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లోనూ రాణిస్తారన్న నమ్మకం ఉన్నది. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి రైతుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉండడం ఎంతో ముఖ్యం.
– చందులాల్‌నాయక్, సర్పంచ్, ఊడ్గులకుంట తండా, బిజినేపల్లి
రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయల్లో మరింత పవర్ఫుల్ నేతగా మారనున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశంలోని రైతులకు కూడా ఉచితంగా కరెంట్ అందనున్నది. రైతులకు న్యాయం చేయడంలో మోదీ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ దేశ రాజకీయల్లోకి వెళ్లనుండడంతో బీజేపీ, కాంగ్రెస్‌కు వణుకుపుడుతున్నది. త్వరలోనే రాష్ట్రంలో రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని అందరికీ అందనున్నాయి.
– కస్పే గోవర్ధన్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు, మరికల్
దేశంలోని నియంతృత్వ, దుర్మార్గ పాలన అంతం చేయాలంటే దేశ్ కీ నేత కేసీఆర్ జాతీ య రాజయాల్లోకి రావాలి. ఆయన దేశంలో చక్రం తిప్పడం ఖాయం. కేసీఆర్‌ను పీఎంగా చూడడం అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రజల చిరకాల కోరిక. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడానికి కేసీఆర్ తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్‌కు చోటు లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే.
– శ్రీనివాసరెడ్డి, సర్పంచ్, పెద్దచింతకుంట, మరికల్
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగు పెడుతుండడం శుభపరిణామం. రైతుల బాగుకోసం ఆలోచించి దేశంలో ఎక్కడా లేని వి ధంగా నిరంతర ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయం, బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు.
– సుగంధ, సర్పంచ్, జాజాపూర్