మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 13 : ఉమ్మడి జిల్లా లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అన్ని జ్వరాలు డెంగీ కాద ని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఉచితంగా రక్తపరీక్షలు, మందులతోపాటు వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వం విషజ్వరాలపై సమరం మొదలుపెట్టింది. ప్రజలకు డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీ సుకుంటున్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మెరుగైన వైద్య సేవ లు అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నదని వై ద్యులు పేర్కొన్నారు.
పడిపోతున్న ప్లేట్లెట్స్
ప్రస్తుతం వైరల్ ఫీవర్స్‌తో జనం విలవిల్లాడుతున్నారు. ఒక్కసారిగా ప్లేట్లెట్స్ పడిపోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. అలా అని డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా నిర్ధారణ కా వడం లేదు. అన్ని నెగిటివ్ ఉన్నప్పటికీ ప్లేట్లెట్స్ మాత్రం పడిపోతున్నాయి. ఇలా ప్లేట్లెట్స్ పడిపోతున్న వారిలో తెలియని వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. అతికొద్ది మందిలో మాత్రమే డెంగీ, మలేరియాతో ప్లేట్లెట్స్ పడిపోతున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడు లేని విధంగా వైరల్ ఫీవ ర్స్ వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వైరల్ ఫీవర్స్ బారిన పడిన వారిలో ఒళ్లు, కాళ్లు, తల నొప్పి, తీవ్రమైన జ్వరం, నీర సం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు చిన్నపిల్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇం ట్లో చిన్నారులు ఒకరి తర్వాత మరొకరు ఈ జ్వరాల బారినపుడుతున్నారు.
ఉచిత పరీక్షలు
ఉమ్మడి జిల్లాలో నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మ హబూబ్‌నగర్ నుంచి విషజ్వరాలతో జనరల్ దవాఖాన మొత్తం కిక్కిరిసిపోయింది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో వాటికి భా రీగా డిమాండ్ పెరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా వాతావరణ మా ర్పుల వల్ల వచ్చే ఏ చిన్న జ్వరం వచ్చినా డెంగీ అని ప్రజలే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ దవాఖా న లకు వెళ్తున్నారు. అవసరం లేకున్నా డెంగీ పరీక్ష చేస్తున్నారు. ప్ల్లే ట్లెట్స్ 60వేల నుంచి లక్ష వరకు ఉన్నప్పటికీ ప్రజలను భ యాందోళనకు గురి చేస్తున్నారు. పెద్దవారిలో 20వేలు, చిన్నపిల్లలో 50వేల కన్నా ప్లేట్లెట్స్ తగ్గితేనే తప్పనిసరిగా ప్లేట్లెట్స్ ఎక్కించాలి. కానీ జనరల్ దవాఖానలో ఉచితంగా ప్లేట్లెట్స్ ప రీక్షలు చేయడంతోపాటు సింగిల్ డోనర్ ప్లేట్లు, ఆర్డీపీ అధునాతన పరికరాలతో రక్తపరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.
ప్రత్యేక వార్డుల్లో డెంగీ వైద్యసేవలు
డెంగీ నిర్ధారణ అయితే దవాఖానలోని రెండు ప్రత్యేక వార్డులతో రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. ఉదయం, సాయం త్రం రెండుసార్లు పరీక్షలు చేస్తారు. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 150 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారికి ప్రత్యేక వార్డుల్లో వైద్యసేవలు అందించి ఇంటికీ క్షేమంగా తరలిస్తున్నా రు. డెంగీ వ్యాధి మూడు దశల్లో ఉంటుంది. మొదట దశలో రక్త స్ర్తావం, రెండో దశలో జ్వరం, బీపీ తగ్గిపోవడం, మూడో దశలో రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయి. అప్పుడు తప్పనిసరిగా రోగికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల నుంచి ఎక్కువ కేసులు
ఉమ్మడి జిల్లాల నుంచి జనరల్ దవాఖానకు డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వనపర్తి 8, నారాయణపేట 20, నాగర్‌కర్నూల్ 30, గద్వాల 2 కేసులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా డెంగీ పరీక్షలు దవాఖానలో చేస్తున్నారు. డెంగీ పూర్తిస్థాయిలో నిర్ధారణ చేసే ఏలిసా పద్ధతి పరీక్షలు జిల్లాలో ఏ ప్రైవేట్ దవాఖానలో చేయడం లేదు. జనరల్ దవాఖానలో మాత్రమే ఈ పద్ధతిలో పరీక్షలు చేస్తున్నారు. అంతే కాకుండా డెంగీ కిట్ ధర రూ.25 వేల వరకు ఉంటుంది. ఏలిసా పద్ధతిలో డెంగీ నిర్ధారణ పరీక్ష చేయడానికి ఒకేసారి కనీసం 30 నుంచి 50 రక్త న మూనాలను సేకరించి పరీక్ష చేస్తున్నారు. పరీక్షలో డెంగీ పూర్తిస్థాయిలో నిర్ధారణ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్లేట్లెట్స్ ఎక్కించే యంత్రం కూడా జనరల్ దవాఖానలో అం దుబాటులో ఉంది. అన్ని పరీక్షలు, వైద్యసేవలు పూర్తి ఉచితంగా జనరల్ దవాఖానలోనే అందిస్తున్నా ప్రైవేట్‌కు వెళ్లి జేబులు గుళ్ల చేసుకుంటారు.
డెంగీ మరణాలు లేవు
ఉమ్మడి జిల్లాలో డెంగీతో ఎక్కడా మరణాలు జరగలేదు. ప్ర భుత్వం డెంగీ నివారణకు అన్ని రకాల పరీక్షలు, మందులు అం దజేయండంతోపాటు ఖరీదైన పరీక్షలు, మందులు వైద్యసేవలు అందజేయడంతో జిల్లాలో డెంగీ మరణాలు జరగలేదని వైద్యు లు చెబుతున్నారు.
డెంగీ కేసులు జూలైలో 323 పరీక్షల చేయగా 20 మంది పాజిటివ్, ఆగస్టు నెలలో 875 మందికి డెంగీ పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. సె ప్టెంబర్‌లో 10వ తేదీ వరకు 578 డెంగీ పరీక్షలు చేయగా 125 మందికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించి వీరికి దవాఖానలో వైద్యసేవలు అందించి ప్లేట్లెట్స్ పెరిగిన తర్వాత క్షేమంగా ఇంటికీ తరలించారు. ఎక్కడా డెంగీ మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
భయపడాల్సిన అవసరం లేదు
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వ జనరల్ దవాఖానలో వై ద్యసేవలు అందిస్తున్నాం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రబలుతున్న జ్వరాలు అన్ని డెం గీ కావు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. డెంగీ మూడు రకాలుగా ఉంటుంది. చివరి దశ లో కాళ్లు, కీళ్లు, నొప్పులు విపరితమైన జ్వరం, కళ్లు ఎర్రగా మారి మూసుకుపోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దవాఖానలో చేర్పించి, చికిత్స అందించాలి. రక్తస్ర్తావం అవుతూ ప్లేట్లెట్స్ 4వేల నుం చి 10వేల లోపు ఉంటేనే వారికి ప్లేట్లెట్స్ ఎక్కించాలి. జనరల్ దవాఖానలో డెంగీ, సీజనల్ జ్వరాలకు సం బంధించి 24 గంటలు వైద్యసేవలు, వైద్యపరీక్షలు అం దుబాటులో ఉండి చేస్తున్నాం.
-డాక్టర్ రాంకిషన్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్