వనపర్తి, (నమస్తే తెలంగాణ)/శ్రీరంగాపూర్/పెబ్బేరు, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో ఉపాధి పెరిగిందని వ్వవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అన్నివర్గాలకు ప్రాధాన్యత పెంచేందుకే సర్కార్ ఆసరా పింఛన్లను ఇస్తుందని, సీఎం కేసీఆర్ చొరవతో 57ఏండ్లకు వయో పరిమితి తగ్గించడంతో రాష్ట్రంలో మరో 10లక్షల మం దికి కొత్తగా పింఛన్లు వచ్చే ఆవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే పింఛ న్లు ఇస్తుంటే, తెలంగాణలో ఒంటరి మహిళలు, గీత కార్మికులకు పింఛన్లు ఇస్తూ సీఎం కేసీఆర్ మానవతా ధృక్పథాన్ని చాటుకున్నారని మంత్రి అన్నారు. కరోనా తో ఆర్థిక వ్వవస్థ దెబ్బతీసినా తెలంగాణ ప్రభుత్వంలో అమలవుతున్న రైతుబీమా, కల్యాణలక్ష్మి, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు.
అంతకుముందు మంత్రి రంగసముద్రం రిజర్వాయర్‌లో లక్ష చేపపిల్లలను వదిలారు. ప్రపంచంలోనే మంచినీటి చేప ల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటస్వామి, ఎంపీపీ గాయత్రి, సింగిల్‌విండో చైర్మన్ జగన్నాథంనాయుడు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడనాయక్, నాయకులు పృథ్వీరాజు, కురుమయ్య, నరేశ్‌నాయుడు, సంపత్నాయు డు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన బతుకులు బుగ్గిపాలు చేశారు : మంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రోళ్లు వైభోగాలు అనుభవిస్తూ.. తెలంగాణ ప్రజల బతుకులను బుగ్గిపాలు చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం జెడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌తో కలిసి మంత్రి పెబ్బేరు సమీపంలోని మహాభూపాల్ జలాశయంలో 88వేల చేపపిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా మంజూరైన పింఛన్ల ప్రొసీడింగ్‌లను లబ్ధి దారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజానీకం చాలా అవస్థలను ఎదుర్కొన్నదన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యమం చేశామని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింహులు, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి, ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, మా ర్కెట్ చైర్పర్సన్ శ్యామల, మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, స ర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.