అయిజ, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో ప్రజారంజక పాల న కొనసాగుతున్నదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల తో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. మన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరునచ్చని కేంద్రం రాష్ర్టాభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగులుతుందని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే అనుమతులిస్తున్న కేంద్రం రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు ప్ర కారం అప్పులు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తూ అనుమతులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. దేశ సంపదనంతా అంబానీ, అదానీల కు దోచిపెడుతుందని విమర్శించారు. బొగ్గు గనులు, వి ద్యుత్, రైల్వేలను ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించా రు. రైతులను పట్టించుకోవడంలో బీజేపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకడుగు వేస్తుందన్నారు. అయిజలో ఇండస్ట్రీయల్ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. నడిగడ్డ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. అనంతరం అయిజ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు వినతి అందజేశారు. సమావేశంలో టీఆర్ఎస్ అలంపూర్ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు, ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి, నాయకులు రవిరెడ్డి, వెంకటేశ్, నర్సింహులు పాల్గొన్నారు.