కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 1: పేదలకు ఆసరా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డినారాయణరెడ్డి, వాణీదేవీ అన్నారు. పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్హాల్లో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరైన వారికి ప్రొసీడింగ్స్, కార్డుల పంపిణీ కార్యక్రమానికి గురువారం వారుముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు. ఈసందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతిఒక్కరికి పార్టీలకతీతంగా పింఛన్ వర్తింపజేశారన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధితోపాటుగా సంక్షేమంలో నెంబర్‌వన్‌గా నిలవడంతోపాటుగా పార్టీలకతీతంగా పథకాలను అర్హులందరికి అందేలా చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు సహకరించాల్సిందిపోయి విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు, అభివృద్ధికి సహకరించని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జీర్ణించుకోలేక ఉచితాలు అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీఅంటేనే తిరుగులేని రాజకీయశక్తి అని రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు అని తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, ఎంపీపీ సామ మనోహర, వైస్ ఎంపీపీ గోవర్ధన్, పార్టీ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ బాలయ్య, ఆర్డీవో రాజేశ్‌కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో ఆంజనేయులు, ఎంపీవో దేవేందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జంగయ్య, నాయకులు, కార్యకర్తలు, కార్యదర్శులు ఉన్నారు.