కొత్తకోట, సెప్టెంబర్ 1 : ఉచిత పథకాలను బంద్ చేయాలనే మోదీ వైపు ఉంటారా..? పేదలకు కష్టం రాకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్ వైపు నిలుస్తారా..? అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం కొత్తకోట పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన 521 ఆసరా పింఛన్లను కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ పింఛన్ రూ.2016, వికలాంగులకు రూ.3016 అందించడం లేదన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 47వేల పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మన పథకాలు మహారాష్ట్రలో అమలు కావడం లేదని ఆ రాష్ర్టానికి సంబంధించిన 47 మంది సర్పంచులు వారి ప్రాంతాలను తెలంగాణలో కలపాలని సంతకాలు చేశారని తెలిపారు. అలాగే కర్ణాటకలో రాయిచూర్ ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని తీర్మానం పంపారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామన్నారు.
అంతకుముందు కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో 62 వేల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 16,023 పింఛన్లు కొత్తగా మంజూరయ్యాయన్నారు. అనంతరం 29 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఆకుల శ్రీను, పట్టణ అధ్యక్షుడు బాబురెడ్డి, మండల మహిళాధ్యక్షురాలు నిర్మలారెడ్డి, పట్టణ మహిళాధ్యక్షురాలు బీమ ప్రసన్నలక్ష్మి, విండో చైర్మన్ వాసుదేవారెడ్డి, కౌన్సిలర్లు రాములుయాదవ్, కొండారెడ్డి, సంధ్యారవీందర్రెడ్డి, పద్మ అయ్యన్న, తిరుపతయ్య, రామ్మోహన్‌రెడ్డి, ఖాజామైనొద్దీన్, కోఆప్షన్ సభ్యులు మిసేక్, సుజాత అద్వానీ శ్రీను, వసీం, వహిద్, మార్కెట్ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు యాదగిరి, విండో డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.