మరికల్, ఆగస్టు 28 : మండలకేంద్రంలో ఆదివారం తె ల్లవారుజామున ఆంజనేయస్వామి ఆలయం నుంచి కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వరకు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భ జనలు చేస్తూ ప్రత్యేక పూలతో అలంకరించి న తేరును లాగారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆంజనేయస్వామి జెల్దిబిందె కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టా రు. ఆంజనేయస్వామి నామస్మరణతో మం డలకేంద్రం మార్మోగింది. అలాగే చివరి సో మవారం స్థానిక భ్రమరాంబాసమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి రథోత్స వం నిర్వహిస్తామన్నారు.
నారాయణపేట రూరల్, ఆగస్టు 28 : మండలంలోని జాజాపూర్ చౌడేశ్వరిమాత ఆలయంలో ఆదివారం దేవాం గ సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా నెల రోజులపాటు ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆలయంలో భజనలు చేశారు. శ్రావణమాసం ముగిపుంతో అమ్మవారికి ఒడిబి య్యం నింపి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలకు గాజులు, జాకెట్లు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గ్గొన్నారు.
దామరగిద్ద, ఆగస్టు 28 : మండలంలోని వివిధ ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని సంజీవరాయ ఆలయంలో పూజలు, భజనలు ని ర్వహించారు. బసవేశ్వర ఆలయంలో భజనలు, పూజలు, భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో నాయకులు పటేల్ బసంత్రాజ్, శరణప్ప, శంభులింగం, పత్తి నర్సప్ప, కోయిలకొండ బసిరెడ్డి పాల్గొన్నారు.