మక్తల్, ఆగస్టు 28 : అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు చెరువులు, కుంటలు నిండా యి. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వ రకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. ఊట్కూర్, మక్తల్ మండలాల్లోని లోతట్టు భూముల్లో సాగైన వరి, పత్తి పంట లు నీటమునిగాయి. అదునులో విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 416.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ధన్వాడ మండలంలో 100 మి.మీ., కోస్గిలో ఎలాంటి వర్షపాతం నామోదు కా లేదు. వరి, పత్తి, కంది పంటలకు వర్షం ఉపయోగపడనున్నది. మక్తల్ మండలంలోని సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి) రిజర్వాయర్‌కు భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీం తో ఆదివారం 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
జిల్లాలో శనివారం అర్ధరాత్రి రెండు గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు ఆయా మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మం డలంలో 62.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట మండలంలో 50.4 మిల్లీమీటర్ల, మద్దూర్ మం డలంలో 12.2 మిల్లీమీటర్ల, ఊట్కూర్ మండలంలో 78. 6 మిల్లీమీటర్ల, మాగనూర్ మండలంలో 11.4 మిల్లీమీట ర్ల, కృష్ణ మండలంలో 20.8 మిల్లీమీటర్ల, నర్వ మండలం లో 47.6 మిల్లీమీటర్ల, మరికల్ మండలంలో 29.8 మిల్లీమీటర్ల, మక్తల్ మండలంలో 4.0 మిల్లీమీటర్ల, ధన్వాడ మండలంలో 100 మిల్లీమీటర్ల నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కోస్గి మండలంలో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు.
జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఊట్కూర్ మండలంలోని ఇండ్లూర్ పెద్దవాగు పొంగి పొర్లుతున్నది. దీంతో తిప్రాస్‌పల్లిలో వరి పంట నీట మునిగింది. ఇదిలావుండగా మక్తల్, మాగనూర్ మండలాల్లోని పెద్దవాగు పరిసర గ్రా మాల్లో పంటలు నీట మునగడంతోపాటు ప్రజలు, రైతుల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తం చేశారు. ఈమేరకు సంగంబండ పెద్ద వాగులోకి ఎవరూ చేపలు పట్టడానికి వెళ్లరాదని అధికారులు సూచించారు.
మాగనూర్, ఆగస్టు 28 : తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో మాగనూర్ పెద్ద వాగుకు జలకళ ఏర్పడింది. మండలంలోని నేరడగం, వర్కూర్, అడవి సత్యారం తదితర గ్రామాల లెవెల్ వంతెనలపై నీరుపారడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. మండలంలోని పెద్ద వాగు వంతెనపై నీరు పారడంతో సీఐ సీతయ్య పరిశీలించారు. వాగులో నీటి మట్టం పెరిగితే వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ఎస్సై నరేందర్‌కు సూచించారు.
నారాయణపేట రూరల్, ఆగస్టు 28 : జిల్లాకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. శేర్నపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై జాజాపూర్ చెరువు అలుగు నీరు ఉధృతంగా పారడంతో ఆదివారం రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల సర్పంచులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ఎవరూ వెళ్లకుండా అప్రమత్తం చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మక్తల్ టౌన్, ఆగస్టు 28 : మక్తల్ ప్రాంతంలోని వాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉం డాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వరద ఉధృతి పెరిగిందని పేర్కొన్నారు.
వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశామన్నారు. నీటిని విడుదల చేస్తున్న క్రమంలో మక్తల్ నియోజకవర్గంలోని మాగనూ ర్ మండలంలోని, నేరడగోం, వర్కూర్, మాగనూర్, అ డవి సత్యారం, అమ్మపల్లి, గజరమందొడ్డి, మక్తల్ మం డంలోని పస్పుల, దాసర్‌దొడ్డి, చిట్యాల గ్రామాల పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నా రు.
రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవ డం వల్ల భారీ స్థాయిలో వరద ఉధృతి పెరుగుతుందన్నా రు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆయా శాఖల అధికారులు వాగు పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అప్రమత్తం గా ఉండాలన్నారు.