మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 28 : రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబు ల్ ప్రాథమిక పరీక్ష జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 63,358మంది ఆభ్యర్థులు పరీక్ష రాసేందు కు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 63 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేశారు. మొత్తం 24,798మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 23,352 మంది హాజరై పరీక్ష రాశారు. 1446 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
అభ్యర్థుల వేలిముద్రలను తీసుకునే ప్రక్రియను పూర్తి చేసేందుకుగా నూ 9గంటలకే కేంద్రంలోకి అనుమతించా రు. కానిస్టేబుల్ రాత పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా 70మంది ట్రాఫిక్ సి బ్బందిని నియమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలే దు.
హైదరాబాద్‌కు చెందిన స్రవంతి జిల్లా కేంద్రంలోని మాతృభూమి ఒకేషనల్ కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉండగా, 10గంటల 5 నిమిషాలకు సెంటర్‌కు చేరుకున్నది. దీంతో పోలీసు అధికారులు అనుమతి ఇవ్వలేదు. తనకు అడ్రస్ దొరక్క సకాలంలో పరీక్షా కేంద్రానికి రాలేకపోయానని ప్రాదేయపడినా పోలీసు అధికారులు అనుమతివ్వకపోవడంతో పరీక్ష రాయలేకపోయింది.
భూత్పూర్, ఆగస్టు 28 : మున్సిపాలిటీలోని న్యూఎరా హైస్కూల్లో ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహించా రు. మొత్తం 360మందికిగానూ 327మం ది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూ పరింటెండెంట్ క్రాంతికుమార్ తెలిపారు. కానిస్టేబుల్ రాత పరీక్ష సందర్భంగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.