నాగర్కర్నూల్, ఆగస్ట్ 26 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆరోగ్యశ్రీ కార్డులు లేని పేదలకు ఆహార భద్రత కార్డులతోనూ ఉచితంగా ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకొనే అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో 8న హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా రూ.5లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలను ఇకపై ఉచితంగానే చేయించుకోవచ్చు. అలాగే ఆయుష్మాన్ పథకమూ వర్తించనున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 2.20 లక్షల ఆహారభద్రతా కార్డులు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్-ఆరోగ్యశ్రీ చికిత్సలకు ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డులతో చికిత్స అందనున్నది. లక్షలాది మంది పేదలకు ఊరట లభించనున్నది. ఇక కార్డులపై సరుకుల పంపిణీతోపాటు ఆరోగ్య భద్రత చేకూరనున్నది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది పేదలకు వ్యయప్రయాసలు తీరనుండగా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఆరోగ్యశ్రీ.. పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చేయించుకునే చికిత్సలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే గొప్ప పథకం. దీని ద్వారా రూ.లక్షలాది విలువైన శస్త్రచికిత్సలు ప్రైవేట్ దవాఖానల్లో చేయించుకోవచ్చు. ప్రభుత్వ దవాఖానల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అమలవుతున్నాయి. అలాంటి ఈ పథకానికి ఆరోగ్య శ్రీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. గతంలో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కార్డులను అందజేసింది. అయితే, కొత్త గా కుటుంబాలు, జనాభా పెరగడంతో ఆరో గ్య శ్రీ కార్డులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కార్డులు లేకుంటే సంబంధిత దవాఖాన ల్లో ఇచ్చే రెఫరల్ లేఖతో దరఖాస్తు చేసుకొని తాసిల్దార్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వ రకు వెళ్లి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉ న్నది. దీంతో రోడ్డు ప్రమాదాలు, గుండె సం బంధిత వ్యాధులతో హైదరాబాద్ దవాఖానలకు వెళ్లి ఆరోగ్య శ్రీ పథకం వర్తించక నానా ఇబ్బందులు పడుతున్నారు.
కార్డు తప్పనిసరిగా ఉండాలనడంతో సొంతూళ్లకు వచ్చి రెవెన్యూ అధికారులు ఇచ్చే ధ్రువీకరణ తీసుకోవాలంటే కాలయాపన జరుగుతున్నది. దీంతో అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కలెక్టరేట్ వద్ద కూడా వీలు కాకుంటే హైదరాబాద్లోని సీఎం కార్యాలయానికి వెళ్లాల్సి వస్తున్నది. దీనికోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరుల సిఫారసుతో చికిత్సలు చేయించుకుంటున్నారు. మరికొందరు సీఎం సహాయ నిధి ద్వారా చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే, ఖర్చు చేసిన డబ్బుల్లో 30 నుంచి 40 శాతం వరకే డబ్బులు అందుతున్నాయి. ఇది పేదలకు నష్టాన్ని కలిగిస్తున్నది.
పేదల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే అమల్లో ఉన్న ఆ హార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) ఆ రోగ్యశ్రీకి అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 8వ తేదీన హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో గ్య శ్రీ అధికారులకూ ఉత్తర్వులు అం దగా.. ఇది పేదలకు ఎంతో ఊరట కల్పించనున్నది. దీనిద్వారా ఆ యుష్మాన్ పథకం కూడా పేదల కు వర్తించనున్నది. ఫలితంగా రూ.5 లక్షల వరకు ఖర్చ య్యే చికిత్సలను ఇకపై ఉ చితంగా చేయించుకోవ చ్చు. ఇలా ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రా ష్ట్రంలో పలు ర కాల వ్యాధుల కు ఉచితంగా వైద్యం అందనున్నది.