కొల్లాపూర్, ఆగస్టు 26 : పేకా ట.. పచ్చని కాపురా లను కూలుస్తున్నది. కు టుంబాల్లో కలహాలు రే పుతున్నది. అయినా పేకాటరాయుళ్లకు అడ్డూఅదు పూ లేకుండా పోతున్నది. పో లీసులు దాడులు తీవ్రతరం చే సిన నేపథ్యంలో వాళ్లు రూటు మార్చారు. పట్టణంలో పేకాట ఆడి తే పట్టుబడుతామని గ్రహించి.. తమ స్థావరాలను పంటపొలాలకు మార్చా రు. అక్కడైతే పోలీసులకు తెలిసే వీలుండదని.., తెలిసినా వచ్చేలోగా పారిపోవచ్చని రూటు మార్చారు. అంతేకాకుండా స్థా వరాల నిర్వాహకులకు ఒక్క ఆటకు రూ.200 చెల్లించే బాధ తప్పుతుందని భావించి సురక్షితంగా ఉన్న పంట పొలాలను అడ్డాగా ఏర్పర్చుకున్నారు.
పది రోజుల కిందట పెంట్లవెల్లి మండలకేంద్రంలో ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై ఆధ్వర్యంలో దాడులు చేసి ఆరుగురు నిందితుల నుంచి సుమారు రూ.40 వేల నగదు, రెండు బైక్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తో కొల్లాపూర్ పేకాటరాయుళ్లు అప్రమత్తమై.. పంట పొ లాలకు అడ్డాను మార్చారు. కొల్లాపూర్ పట్టణ శివారులోని చౌటబట్ల రోడ్డులో నర్సింగరావుపల్లికి వెళ్లే కాలిబాట మార్గంలో ఉన్న చె రువుకుంట వద్ద పేకాట ఆడుతున్నారు. అక్కడికి వచ్చే వారి ఆచూకీని సులువు గా తెలుసుకునే అవకాశం ఉండడంతో ఆ ప్రదేశాన్ని సురక్షితంగా భావిస్తున్నా రు. అలాగే పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల, యాపట్ల, నాయినోనిపల్లి, పెద్దకొత్తపల్లి గ్రామాల్లో పోలీసులు పేకాటస్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన విషయం విదితమే.
కొల్లాపూర్ పట్టణంలో కొంత కాలంగా గుట్టుగా పే కాట స్థావరాలను నిర్వహిస్తున్నారు. పేకాట ప్రియులు నిర్వాహకుల అనుమతితో అక్కడికి చేరుకుంటారని తెలిసింది. ఉదయం 11 గంటల నుంచి చీకటి పడే వరకు లేదా తీసుకుపోయిన డబ్బులు అయిపోయే వరకు లేదా ప్రత్యర్థి ఆటగాళ్లతో మొత్తం డబ్బులను గెలుచుకొనే వరకు ఆటను కొనసాగిస్తున్నారు. పోగొట్టుకున్న డబ్బు లు ఎలాగైనా గెలుచుకోవాలన్న కసితో పేకాటరాయుళ్లు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
నగలు, ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, బైకులు, కార్లు.. ఇలా ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని వడ్డీ వ్యాపారులు డబ్బులు ఇస్తున్నారు. అయితే, వడ్డీ వ్యాపారుల నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నట్లు పేకాటరాయు ళ్లు చెబుతున్నారు. రూ.10వేలు తీసుకుంటే నెల వడ్డీ రూ.1,000 అడ్వాన్సుగా పట్టుకొని రూ.9వేలు ఇస్తున్నారు. ఇలా తాకట్టు పెట్టే వస్తువుల విలువను బట్టి రూ.50వేల నుం చి రూ.లక్ష వరకు అప్పు ఇస్తున్నట్లు తెలిసింది. నెలలోగా అప్పు చెల్లించకుంటే వడ్డీ, అసలు కలిపి మొత్తం అప్పు రూపంలో ప్రామిసరీ నోటు రాసుకుంటున్నారు. ఇలా పేకాటరాయుళ్లు రూ.లక్షల్లో నష్టపోతున్నా రు. అయినా పేకాటకు వ్యసనంగా మారుతున్నారు.
దీంతో భార్యాభర్తల మధ్య కలహాలు రేగుతున్నాయి. భా ర్యలు పుట్టింటికి వెళ్లి తిరిగిరావడం లేదు. ఇటీవల భార్య తన వెంట రాలేదని తాగిన మైకంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల కిందట కొల్లాపూర్ పట్టణంలో చోటు చేసుకున్నది. ఇందుకు పేకాటనే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ పట్టణంలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఏకంగా మూడు కార్లను తాకట్టుపెట్టాడని తెలిసింది. గడువులోగా డబ్బు లు చెల్లించకపోతే సదరు కార్లను అద్దెకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్లు దెబ్బతిన్నా.. తమకు ఎలాంటి సంబంధం ఉండదని ముందుగా అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి పేకాట కోసం రూ.లక్షల్లో అప్పు చేయగా.. తన ఇంటిని తాకట్టు పెట్టి ఉడాయించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతున్నది. ఇలా పేకాటరాయుళ్ల వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారస్తులు దోపిడీకి పాల్పడుతున్నారు. సీఐ యాలాద్రిని వివరణ కోర గా.. కొల్లాపూర్ సర్కిల్లో పేకాట స్థావరాలపై ప్ర త్యేక నిఘా పెట్టామన్నారు. పోలీసులు గ్రామాల్లో మఫ్టీలో తిరుగుతున్నారని, పేకాటరాయుళ్లతోపాటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.