గోపాల్పేట, ఆగస్టు 26 : అన్ని వర్గా ల ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ ఫలాలు భవిష్యత్ త రాలకు కూడా అందేలా పనిచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బు ద్ధారం గ్రామంలో విశ్వవాణి గ్రామీణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గ్రామ ర త్న అవార్డులను అందజేశారు. నిస్వార్థ సేవలు చేసినందుకుగానూ గ్రామ రత్న అవార్డులకు ఎంపికైన ఆర్.బల్రాంరెడ్డి, పి.చెన్నయ్య, ఎండీ.రహిమత్జానిని, ది వంగత వి.బుచ్చయ్య, కె.నర్సింహారా వు, ఎండీ ఇబ్రహీం కుటుంబసభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించా రు. అనంతరం మెమొంటోలను అందజేశారు. విశ్వవాణి గ్రామాభివృద్ధి సం ఘం సభ్యులు మంత్రిని సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్కార్ చేస్తున్న పనులు మరిచిపోవద్దన్నారు. ఉన్న నీటిని వాడుకునే అవకా శం లేక 60 ఏండ్లు నష్టపోయామన్నా రు. రైతులకు సత్వరమే సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జాగీరుదారు కాల్వ త వ్వించామన్నారు. వనపర్తి జిల్లాలో భూ గర్భజలాలు పెరిగాయన్నారు. అనంత రం బుద్ధారం చెరువును తక్కువ టీఎంసీలకు కుదించి రిజర్వాయర్‌గా మార్చాలని, గ్రంథాలయ పనులు పూర్తి చేయించాలని, పీహెచ్సీ భవనం ఏర్పాటు తదితర అంశాలపై గ్రామస్తులు మంత్రికి వి నతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ శ్రీదేవి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, కో ఆప్షన్ సభ్యుడు మతీన్, విశ్వవాణి సంఘం అధ్యక్షుడు నాగేంద్రం, ప్రధాన కార్యద ర్శి పుల్యానాయక్, ఉపాధ్యక్షుడు ఓం కార్ తదితరులు పాల్గొన్నారు.