మహబూబ్‌నగర్, ఆగస్టు 26 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో అలజడి సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉ ద్దేశంతో కమలం పార్టీ నాయకులు కుట్ర లు పన్నుతున్నారని విమర్శించారు. శు క్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో జరిగిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మండలానికి చెందిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ టంకరి శివప్రసాద్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకు చెం దిన దాదాపు 300 మంది యువకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుంద ని దుయ్యబట్టారు.
కులమత రాజకీయాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. యువత అప్రమత్తమై అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం కష్టపడుతున్న అధికార పా ర్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకూ టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చా రు. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. సమైక్య రా ష్ట్రంలో 70 ఏండ్లపాటు అధికారం ఒరగబెట్టిన పార్టీలు, కార్యకర్తల భుజాలపై ఎక్కి రాజ్యమేలారని గుర్తు చేశారు. పే ద, మధ్య తరగతి కుటుంబాలకు చెంది న యువతను వారి తల్లిదండ్రులు కష్టపడి చదవించారని, అందుకే వారి కు టుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్య త ఉన్నదన్నారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యువత అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా, ముడా చైర్మన్ వెంకన్న ముదిరా జ్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ కిషోర్, రాంచంద్రపూర్ సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు సత్యంయాదవ్, రాములు, భాస్కర్, మోహన్ నా యక్, దాసరికన్న, శివశెట్టి, అనితారెడ్డి, వాణి, సాయిలక్ష్మి, లత పాల్గొన్నారు.