హన్వాడ, ఆగస్టు 26 : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 57ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ మంజూరైంది. ప్రభుత్వ నిర్ణయంతో హన్వాడ మండలంలో కొత్తగా 1,364మంది పింఛన్లు అందుకోనున్నారు. గతంలో 5,100మందికి పింఛన్లు రాగా, ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 6,464కు చేరింది. లబ్ధిదారులకు శనివారం నుంచి ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పింఛన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. మండలానికి సంబంధించిన ఫించన్ కార్డులను గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులకు అందజేశారు. ప్రతి గ్రామానికి మంత్రి స్వయంగా వచ్చి లబ్ధిదారులకు పింఛన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.
ఉమ్మడి గండీడ్ మండలంలో..
గండీడ్, ఆగస్టు 26 : ఉమ్మడి గండీడ్ మండలంలో ఆసరా పథకం లబ్ధిదారులకు శనివారం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పింఛన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి గండీడ్ మండలంలో కొత్తగా 1979మంది లబ్ధిదారులు పిం ఛన్లకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. మహ్మదాబాద్, నంచర్ల, వెన్నాచేడ్, సల్కర్‌పేట గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఆగస్టు 26 : మండలంలోని పాతమొల్గరలో శనివారం ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో మున్ని ప్రకటనలో తెలిపారు. మండలంలో 949మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. అన్నాసాగర్‌లో 62మందికి, భట్టుపల్లి 12మంది, చౌలతండాలో ఆరుగురు, హస్నాపూర్‌లో 38మంది, కప్పెటలో 49మంది, కరివెనలో 125మంది, కొత్తమొల్గరలో 75మంది, కొత్తూర్‌లో 48మంది, లంబడికుంటతండాలో ఇద్దరికి, మద్దిగట్ల లో 101మంది, పాతమొల్గరలో 31మంది, పోతులమడుగులో 72మంది, రావులపల్లిలో 26మంది, శేరిపల్లి(హెచ్) లో ఆరుగురికి, తాటికొండలో 140మంది, తాటిపర్తిలో 45మంది, వెల్కిచర్లలో 111మందికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. పాతమొల్గర గ్రామంలో పింఛన్‌కార్డుల పం పిణీని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
నోటీస్ బోర్డుపై జాబితాను ఏర్పాటు చేయాలి
నవాబ్‌పేట, ఆగస్టు 26 : పింఛన్ లబ్ధిదారుల జాబితాను పంచాయతీ కార్యదర్శులు నోటీస్‌బోర్డుపై ఏర్పాటు చేయాలని ఎంపీపీ అనంతయ్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కొత్త పింఛన్ల జాబితాతోపాటు లబ్ధిదారుల కార్డులను పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో కొత్తగా 1699మందికి ఆసరా పింఛర్లు మంజూరైనట్లు తెలిపారు. పింఛన్‌కార్డులను త్వరలోనే ఆయా గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 57ఏండ్లు నిండి పింఛన్ రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుధాకర్, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, ఎంపీడీవో శ్రీలత, రైతుబంధు సమితి మండ ల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ముడా డైరెక్టర్ గండు చెన్న య్య, ఎంపీవో భద్రూనాయక్ పాల్గొన్నారు.