నారాయణపేట, ఆగ స్టు 26 : అమ్మాయిలు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, మాజీ డీజీపీ అనురాగ్‌శర్మ సూచించారు. రోట రీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో అరబిందో ఫా ర్మా ఆర్థిక సాయంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతు న్న అమ్మాయిలకు శుక్రవారం స్కిల్ సెంటర్లో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనురాగ్‌శర్మ మాట్లాడుతూ త న సతీమణి మమతా శర్మ ఆలోచన మేరకు రోటరీ క్లబ్ వారి సహకారంతో అమ్మాయిల కు 800 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న ట్లు చెప్పారు.
అమ్మాయిలు సకాలంలో పాఠశాలకు చేరుకునేందుకు సైకిళ్లు ఉపయోగపడుతాయన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలియో రహిత ప్రపంచం కోసం కృషి చేసి విజయం సాధించిన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు సహకారం అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాండ్ వాష్ పెట్టించడానికి సైతం ముందుకొచ్చారన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ సైకిళ్ల పంపిణీతోపాటు జిల్లా దవాఖానలో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు, మ హిళలకు క్యాన్సర్ రోగ నిర్ధారణ శిబిరాన్ని ఏ ర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా చైర్మన్ రఘునాథన్ కన్నన్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మాజీ ఐ పీఎస్ మమతాశర్మ, జ్ఞాన ప్రసూన, డీఈవో గోవిందరాజులు, రోటరీ క్లబ్ కో ఆర్టినేటర్ ఉదయ్పిలానీ, సభ్యులు రాజశేఖర్ ఉన్నారు.