ఊట్కూర్, ఆగస్టు 26 : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పరితపించిన దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దామని పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం చిట్టెం నర్సిరెడ్డి జయంతి సందర్భంగా మం డల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉ పసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు వెంకటేశ్‌గౌడ్, నాయకులు శంకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఆర్.హనుమంతు, గోవిందప్ప, చంద్రశేఖర్‌రెడ్డి, కతలప్ప, జమీర్, జగదీశ్‌గౌడ్, మోనప్ప, షమీఉల్లా, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, ఆగస్టు 26 : మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధన్వాడలోని మెయిన్ రోడ్డులో ఉన్న చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పూలమాలవేసి ని వాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ జిల్లా డైరెక్టర్ శివారెడ్డి, షాకీర్ హుస్సేన్, మాజీ ఉపసర్పంచ్ న ర్సింహులు, టైలర్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ మండలంలో…
మక్తల్ టౌన్, ఆగస్టు 26 : మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణం లో శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివా సం లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నర్సిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మండలంలోని సంగంబండ గ్రా మ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్‌పై, పడమ టి ఆంజనేయస్వామి ఆల య ప్రాంగణంలో, టీఆర్ఎస్ నాయకుడు గాల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన నర్సిరె డ్డి జయంతి వేడుకలకు ఎమ్మెల్యే హాజరై ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎంపీపీ వనజ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గుప్తా, మండలాల పార్టీ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రవికుమార్‌యాదవ్, కౌన్సిలర్లు మొగులప్ప, రాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.