మహ్మదాబాద్, ఆగస్టు 26 : సేవాగుణానికి మారుపేరు మదర్ థెరిస్సా అని మాజీ ఎంపీపీ శాంతిబాయి అన్నారు. మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా శుక్రవారం మండలకేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మదర్ థెరిస్సా ఎంతోమందికి సేవలు అం దించి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకున్నారని గుర్తుచేశారు. ప్రతిఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని పేదలకు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో రహీం, లక్ష్మణ్, పల్గుణ, పాండు ఉన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
జడ్చర్లటౌన్, ఆగస్టు 26 : పట్టణంలోని పలు ప్రాం తాల్లో మదర్ థెరిస్సా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన సేవాసమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశా రు. అలాగే ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యం లో మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ హర్షదుల్లా, మన సేవాసమితి సభ్యులు రాఘవేందర్, రాధాకృష్ణ, బాలాజీ, జహంగీర్పాషా, బాలమణి, గంగాధర్, సురే శ్, సరిత, భూమిక, నందిని, ఫరీదా పాల్గొన్నారు.