ఖిల్లాఘణపురం, ఆగస్టు 25 : ప్రజల సహకారంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా పే ర్కొన్నారు. బుధవారం రాత్రి ఖిల్లాఘణపురంలో పల్లెనిద్ర చేసిన కలెక్టర్ గురువారం ఉదయం మండల కేంద్రంలోని పలుకాలనీల్లో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, పల్లెనిద్ర కార్యక్రమాల్లో 52 శాఖల అధికారులు పాల్గొని సమస్యలపై నివేదికలు తయారు చేస్తారన్నారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరిస్తారని, పరిష్కారంకాని సమస్యలను ఉన్నతాధికారులతో చర్చించి ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వా మ్యం చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి 20 రోజులకు ఒకసారి గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కేజీబీవీ విద్యార్థులు పాఠశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సామ్యానాయక్, సర్పంచ్ వెంకటరమణ, ఎం పీటీసీలు ఆశాజ్యోతి, వాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వనపర్తి, ఆగస్టు 25 : ప్రజల వద్దకు పాలన ఎప్పుడైతే వస్తుందో వారి సమస్యలు తీరి సుఖసంతోషాలతో ఉంటారని ఆ దిశగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాలతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అన్నారు. గురువారం ఉదయం 30వ వార్డులో మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రత్యేకాధికారి చం ద్రశేఖర్, 1వ వార్డులో కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ, ప్రత్యేకాధికారి ఎల్లస్వామి, 6వ వార్డులో కంచె రాఘవేంద్ర, ప్రత్యేకాధికారి అశోక్, 15వ వార్డులో బండా రు కృష్ణ, ప్రత్యేకాధికారి మోహన్, 18వ వార్డులో కౌన్సిలర్ సత్యమ్మా శరవంద, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, 22వ వార్డు లో కౌన్సిలర్ చీర్ల సత్యనారాయణ, ప్రత్యేకాధికారి ప్రమోద్‌కుమార్ మార్నింగ్‌వాక్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొ ని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమం లో ఎస్సై యుగంధర్‌రెడ్డి, నాయకులు శరవంద, పరంజ్యో తి, లతీఫ్, తదితర నాయకులు ఉన్నారు.
వనపర్తి రూరల్, ఆగస్టు 25 : మండలంలోని పలు గ్రామా ల్లో నిర్వహించిన వజ్రసంకల్ప కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం అధికారులు గ్రామాల్లో మార్నింగ్ వాక్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడుకుంట్ల, నాచహళ్లి, చందాపూర్, చిట్యాల, చిమనగుంటపల్లి, కాశీంనగర్ గ్రామాల్లో బుధవారం రాత్రి పల్లెలో నిద్రించి గురువారం ఉదయమే వీధుల్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించారు. వీటన్నింటిపై నివేదిక తయా రు చేసి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. కార్యక్రమాల్లో చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకటరమణ, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ జాన్కృపాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ నాగేంద్రకుమార్, చిట్యాల ప్రిన్సిపాల్ మద్దిలేటి, డీఎల్పీవో రఘునాథ్‌రెడ్డి, తాసిల్దార్ రాజేందర్‌తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పెబ్బేరు రూరల్, ఆగస్టు 25 : వజ్రసంకల్పం కార్యక్రమంలో భాగంగా పెబ్బేరు మండలంలో పల్లెనిద్రలో పాల్గొ న్న అధికారులు గురువారం గ్రామాల్లో పర్యటించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని పలు విజ్ఞప్తులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వై.శాఖాపురంలో జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డితోపాటు మంత్రి ఓఎస్డీ పూర్ణచంద్రారెడ్డి, బు న్యాదిపురంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ నరేందర్‌కుమార్, రంగాపురంలో ఆర్అండ్బీ డీఈ దానయ్య, గు మ్మడంలో జిల్లా ఉద్యానవన అధికారి సురేశ్, యాపర్లలో జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వరరెడ్డితోపాటు ఆయా గ్రా మాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
గోపాల్పేట, ఆగస్టు 25 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు బుధవారం రాత్రి ఆయా శాఖల అధికారులు పల్లెనిద్ర చేపట్టారు. గురువారం ఉదయం వా రు గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. గోపాల్‌పేటలో ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్, తాడిపర్తిలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, పోల్కెపహాడ్లో జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, బు ద్ధారంలో డీసీ క్రాంతి, ఏదుట్లలో సివిల్ సైప్లె డీఎం కొం డల్‌రావు, ఏదులలో ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రావు తదితరులు పర్యటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్‌తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్, ఆగస్టు 25 : మండలంలోని శ్రీరంగాపూర్, జానంపేట, వెంకటాపూర్, నాగసానిపల్లి, కంభాళాపూర్, తాటిపాముల గ్రామాల్లో పల్లెనిద్ర చేసిన అధికారులు గురువారం గ్రామాల్లో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని నమోదు చేసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీరంగాపూర్లో ప్రత్యేకాధికారి స్వరణ్‌సింగ్, జానంపేటలో ప్రత్యేకాధికారి డాక్టర్ రవిశంకర్, తాటిపాములలో ప్రత్యేకాధికారి సురేశ్‌కుమార్, కంభాళాపూర్లో ప్రత్యేకాధికారి డా క్టర్ శ్రీనివాసులు, వెంకటపూర్‌లో ప్రత్యేకాధికారి సుల్తాన్, నాగసానిపల్లిలో ప్రత్యేకాధికారి విక్రమ్‌సింహారెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు వెంకటస్వామి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గౌడనాయక్, ఎంపీడీవో ప్రసన్నకుమారి ఉన్నారు.
రేవల్లి, ఆగస్టు 25 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు అధికారులు బుధవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్ర మం చేపట్టారు. గురువారం ఉదయం గ్రామాల్లో పర్యటిం చి ప్రజలను కలిసి సమస్యలను గుర్తించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి మిగతా వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లామత్యశాఖ అధికారి ఎస్ఏ రెహమాన్, డీఈ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, డీఆర్డీవో పీడీ నర్సింహులు, జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత, పంచాయతీరాజ్ ఈఈ మల్ల య్య, తాసిల్దార్ శ్రీరాములు, డీటీ రామకృష్ణతోపాటు స ర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వనపర్తి, ఆగస్టు 25 : సీఎం కేసీఆర్ సారు పింఛన్లు ఇస్తుంటే ప్రధాని మోదీ రేట్లు పెంచుతూ వచ్చే పింఛన్‌ను గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోయినట్లు మా పింఛన్ ఎత్తుకొని పోతున్నాడని గొర్ల అక్కమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వజ్ర సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో అధికారులు బుధవారం రాత్రి వార్డునిద్ర చేసి గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేసి ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కమ్మ మాట్లాడుతూ “నాకు ఆస్తమా ఉంది నాకు నెలనెలా కేసీఆర్ సార్ వృద్ధాప్య పిం ఛన్ ఇస్తున్నాడని, ప్రధాని మోదీ అన్ని ధరలను పెంచుకుంటూ పోతే ఎట్టా బతకాలి సార్” అని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, పట్టణ ఎస్సై యుగంధర్ ముందు వాపోయింది.