మహబూబ్‌నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతడో సా ధారణ రైతు.. ఉన్న ఎకరం పొలంలో పండిన పంటనే జీవనాధారం.. ఆ ఎకరం సాగు చేసుకుందామంటే కూలీలు దొరకని పరిస్థితి. వర్షాధార పంటలో భాగమైన ఆ ముదం వేసి మందులు పిచికారీ చేస్తుండ గా.. గాలికి ఆ మందు శరీరంపై పడి తీవ్ర అ స్వస్థతకు గురయ్యారు. తర్వాత ఎరువు వేయాలన్నా కూలీల కొరత. వీటిని ఎలా అధిగమించాలని బాగా ఆలోచించాడు. అతడికి తట్టిన ఆలోచనతో శాస్త్రవేత్తగా మారాడు.
తన ఆలోచనకు పదునుపెట్టాడు. కూలీల అవసరం లేకుండా పొలంలో పెస్టిసైడ్తో పాటు ఎరువులను కేవలం ఒక వ్యక్తే పిచికారీ చేసే యంత్రం రూపొందించాడు. తక్కువ ఖర్చుతో కూలీల అవసరం లేకుండా.. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తయారు చేసిన స్ప్రేగన్స్ ఇంటింటా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. ఏకంగా జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యింది. ఈ అద్భుత యంత్రాన్ని రైతులే ఇంటి వద్ద తయారు చేసుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆ రైతును స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఉత్తమ అవార్డుతో సత్కరించారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల గ్రామానికి చెందిన మఖ్తుం అలీ రైతు సక్సెస్ స్టోరీయే ఇది..
పొలంలో ఎరువులు చల్లడం కూడ రిస్క్‌తో కూడుకున్న పనే. ఈ కష్టాలకు చక్కటి పరిష్కారం లభించింది. నాలుగు ఇంచుల పైపునకు చివరలో మరో నల్లపైపు బిగించి లోపల బేరింగ్‌లతో ముందుకూ.. వెనుకకు పోయే విధంగా తయారు చేసిన ఈ పరికరంతో కేవలం ఒకరి సాయంతో పంటకు ఎరువు అందించవచ్చు. వర్షాధార పంటలకు మాత్రం మొక్కమొక్కకూ ఎరువు వేయాలంటే చాలా మంది కూలీలు అవసరం. కానీ ఈ పరికరంతో ఒక వ్యక్తి సాయంతో ఎరువు వృథా కాకుండా నేరుగా మొక్కకు వేయొచ్చు.
ఈ రెండు పరికరాలు తయారీ చేయడంతో రైతు మఖ్తుం అలీకి మంచి పేరొచ్చింది. ఎక్కడ మందు పిచికారీ చేయాలన్న ఈయన ఎడ్ల బండినే వాడుతున్నారు. ఎడ్లబండి స్ప్రేయర్ గన్‌తో సుమారు 4, 5 అడుగుల ఎత్తున ఉండే అన్ని రకాల పంటలకు, పండ్ల తోటలకు ఉపయోగించవచ్చు. ఎకరం పొలానికి కేవలం 15 నిమిషాల్లోనే స్ప్రే పూర్తవుతుంది. నిత్యం అన్ని ఖర్చులుపోనూ ఉన్న ఊళ్లోనే సీజన్లో రోజుకూ రూ.7 వేలు మిగులుతాయని సదరు రైతులు తెలిపాడు. ఈ యంత్రాలను చూసిన గ్రామస్తులు ఐడియా అందిరింది అంటున్నారు.
సోషల్ మీడియలో పోస్టు చేయడంతో కలెక్టర్ హరిచందన, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సదరు రైతు ఆలోచనను అభినందించారు. వజ్రోత్సవాల సందర్బంగా వ్యవసాయ శాఖ తరఫున ఏర్పాటు చేసిన స్టాల్లో ఈ యంత్రం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఉత్తమ ఇన్నోవేషన్ కింద జిల్లా స్థాయి అవార్డుకు ఎంపిక కాగా రాష్ట్రస్థాయికి పంపించారు.
కల్వాల గ్రామానికి చెందిన రైతు మఖ్తుంఅలీకి ఎకరా పొలం ఉన్నది. అదే ఆయన జీవనాధారం. వర్షాధార పంటలు పండించగా వచ్చిన దిగుబడితోనే కుటుంబాన్ని పోషించాలి. ఆముదం పంటకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించేందుకు నలుగురు కూలీలు వచ్చినా సాయం త్రం వరకు ఎకరా కూడా పూర్తి చేయలేదు. మందు స్ప్రే చేసే సమయంలో గాలుల తో ఆ మందు శరీరంపై పడి వారు అస్వస్థతతకు గురయ్యారు. మళ్లీ వచ్చేందు కు నిరాకరించారు.
ఈ సమస్య ప్రతి రైతుకూ ఎదురవుతుందని గ్రహించిన మఖ్తుం స్ప్రేగన్ రూపొందించాడు. ఒక ఎడ్లబండిలో 5 హె చ్పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైపర్ మోటార్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గ న్స్‌తో ఈ యంత్రాన్ని రూపొందించాడు. ఇం దుకోసం రూ.50 వేలు ఖర్చు చేశాడు. ఇ ది లైఫ్‌టైమ్ పనిచేస్తున్నది. మోటా రు కాలిపోతే మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటుంది.
పొలాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలంటే కనీసం ముగ్గురు కూలీలు కావాలి. నీళ్లు తేవడానికి ఇద్దరు మహిళా కూలీలు, స్ప్రే చేయడానికి మరో కూలీ అవసరం. స్ప్రింక్లర్ నడవాలంటే పెట్రోల్ కావాలి. 30 డబ్బాలు కొట్టేసరికి సాయంత్రం అవుతుంది. దినమంత రెండు ఎకరాలు కొట్టొచ్చు. ఈ ముగ్గురు కూలీలకు దినసరి కూలి రూ.2,500 అవుతుంది. రెండు లీటర్ల పెట్రోల్‌కు మరో రూ.220 ఇలా కనీసం రెండెకరాలకు రూ.3 వేల ఖర్చు అవుతుంది. అయితే రైతు తయారు చేసిన స్ప్రేగన్తో రెండెకరాలకు అయ్యే ఖర్చుతో పదెకరాలకు మందులు పిచికారీ చేయొచ్చని సదరు రైతు చెబుతున్నాడు.