పాలమూరు, ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జెడ్పీ మైదానంలో మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించారు. పోటీలను ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించగా, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ స్వ తంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొ ని దేశభక్తిని చాటాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశా రు. కార్యక్రమంలో డీఆర్డీవో శారద, డీఎస్వో వనజాత, సోషల్ వెల్ఫేర్ డీడీ యాద య్య, హౌసింగ్ ఈఈ భాస్కర్, డీపీఎం నాగమల్లిక, ఆర్ఐ నర్సింగ్‌నాయక్, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
స్వతంత్ర భా రత వజ్రోత్సవాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జరీనాబేగం, కమల, ఐకేపీ, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
స్వతంత్ర భార త వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ముగ్గులపోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొ ని రంగవల్లులను తీర్చిదిద్దారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన మహిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీవో భద్రూనాయక్, సర్పంచులు వసుంధర, జంగయ్య, లక్ష్మమ్మ, సౌజన్య, జయమ్మ, కృష్ణయ్య, సత్యం, యాదయ్య, వెంకటేశ్, నాయకులు రవి, వెంకటేశ్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని కౌకుంట్ల, హజిలాపూర్ తదితర గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బుచ్చారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, రాధిక, నా యకులు కిషన్‌రావు, రాజు పాల్గొన్నారు.