పాలమూరు/జడ్చర్లటౌన్/బాలానగర్/ భూత్పూర్, ఆగస్టు 20 : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా ఘ నంగా జరుపుకొన్నారు.జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించా రు. ఈ సందర్భంగా మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకున్నది. అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఉట్టి కొట్టేందుకు యువత పోటీపడ్డారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. అలాగే జడ్చర్లలోని స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో చిన్నారులు చిన్నికృష్ణుడి వేషధారణతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సం దర్భంగా భక్తి గీతాలాపన, భగవద్గీత శ్లోకా లు, భక్తిపాటలు పాడారు. అనంతరం భగవద్గీతపై క్విజ్ పోటీలు నిర్వహించడంతోపాటు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించా రు. అలాగే మున్సిపాలిటీలోని విద్యానగర్‌కాలనీ స్మార్ట్వండర్స్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. సంస్కారభారతి ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, గోవర్ధన్, గోనెల రాధాకృష్ణ, స్వామినారాయణ్ గురుకుల్ నిర్వాహకులు శుకవల్లభ్దాస్, సద్గుణ్ ప్రియదాస్, భావిష్, అక్షరభగత్, కల్పేష్భగత్, శివకృష్ణ, రాఘవాధిత్య పాల్గొన్నారు. అదేవిధంగా బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యం లో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీసేవ నిర్వహించి పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్‌యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, యాదవ సంఘం నాయకులు ప్రేమ్‌కుమార్, బాలరాజు, నర్సింహులు, యాద య్య పాల్గొన్నారు. భూత్పూర్ మండలంలోని పోతులమడుగు వేణుగోపాలస్వామి ఆలయంలో ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత పోటీపడి ఉట్టిని కొట్టారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, గ్రామస్తులు రమేశ్చందర్, కృష్ణ య్య తదితరులు పాల్గొన్నారు.