మక్తల్ టౌన్, ఆగస్టు 20 : జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లే కుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పట్టణంలోని నల్లజానమ్మ ఆలయ ప్రాంగణం ఎదుట జాతీయ రహదారిపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఎమ్మె ల్యే పరిశీలించారు. జాతీయ రహదారిపై కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ర్టాలతోపాటు ఇతర ప్రాంతాలకు వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తాయని ఎమ్మె ల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ప్రసన్ననందా సరస్వతి శివైక్యం బాధాకరం
వల్లభపురంలోని దత్తాత్రేయస్వామి ఆలయం దత్త పీఠాధిపతి ప్రసన్ననందా సరస్వతీస్వామి శివైక్యం చెందిన విష యం ఎంతో బాధను కలిగించిందని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వల్లభపురం దత్త పీఠాలయంలో ప్రసన్ననందా సరస్వతీస్వామిజీ పార్థివదేహానికి శనివారం ఎమ్మెల్యే పూ లమాల వేసి నివాళులర్పించా రు. దత్త ఆశ్రమంలో స్వామిజీ అంత్యక్రియలు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.
క్రీడలతోనే మానసిక ప్రశాంతత
క్రీడలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 18న జి ల్లాకేంద్రంలోని స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడల్లో మక్తల్ ప్రాంతానికి చెందిన యువతీ యువకులు పాల్గొని ప్రతిభ కనబర్చి గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హా జరై క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన క్రీడల్లో బాలికలు ఖోఖో ప్రథమ స్థానం, వాలీబాల్, కబడ్డీలో ద్వితీయ స్థానం, మహిళలు లాంగ్‌జంప్‌లో ప్రథ మ స్థానం, 100 మీ పరుగులో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందడం ఆనందదాయకమన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు శా లువాలతో ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, ఎంఈవో లక్ష్మీనారాయ ణ, విశ్రాంత పీఈటీ గో పాలం, ఎంపీడీవో శ్రీధ ర్, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ బలరాంరెడ్డి, సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవల కోసం
రాష్ట్రంలో అనారోగ్యం బారిన పడినవారికి మెరుగైన వైద్య సేవలను చేసుకొని ఆరోగ్యవంతులుగా తయారు కావ డం కోసమే సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ ని యోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, నర్వ, కృష్ణ, ఊ ట్కూర్, ఆత్మకూర్, అమరచింత మండలాలకు చెందిన 81 మంది లబ్ధిదారులకు రూ.50లక్షలకు చెక్కులను ఎమ్మె ల్యే నివాస గృహంలో శనివారం అందజేశారు. పట్టణానికి చెం దిన అసియాకు రూ.లక్ష 20వేలు, అశోక్‌కు రూ.82వేలు, కొండదొడ్డి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు రూ.30వే లు, జక్లేర్ గ్రామానికి చెందిన దేవేంద్రమ్మకు రూ.24 వేలు, పంచదేవ్పహడ్ గ్రామానికి చెందిన రాము కు రూ.60వే లు, రాజుకు రూ.60వేలు, సంఘంబండ గ్రా మానికి చెంది న బుగ్గప్పకు రూ.49వేలు, నర్వ మండలం కన్మనూర్ గ్రా మానికి చెందిన చిన్న మల్లప్పకు రూ.40 వేలు, ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన భీంరెడ్డికి రూ.30వే ల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, స ర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.