అయిజ, ఆగస్టు 20 : కర్ణాటకలోని తుంగభ ద్ర డ్యాం వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో 31,208 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 30,717 క్యూసెక్కులుగా నమోదైనట్లు డ్యాం ఎస్ఈ శ్రీ కాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 105.788 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ పూర్తిస్థాయి నీటిమట్టం నమోదైనట్లు పేర్కొన్నా రు. అలాగే ఆర్డీఎస్కు వరద వచ్చి చేరుతున్నది. ఇన్‌ఫ్లో 20,631 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 20, 200 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 431 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 9.7 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు తెలిపారు.
జూరాలకు..
అమరచింత, ఆగస్టు 20 : జూరాల ప్రాజెక్టు కు వరద మరింత తగ్గింది. శనివారం సాయంత్రానికి 2.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో డ్యాం 40 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. విద్యుదుతృత్తి కోసం 32,186, భీమా లి ఫ్ట్-2కు 750, ఎడమ కాల్వకు 920, కుడి కా ల్వకు 608 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉం డగా.. మొత్తంగా 1,97,961 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలంలో..
శ్రీశైలం, ఆగస్టు 20 : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. శనివారం జూరాల ప్రా జెక్టు గేట్ల నుంచి 1,62,680, విద్యుదుత్పత్తి నుంచి 32,323, సుంకేసుల నుంచి 21,555 క్యూసెక్కులు విడుదలైంది. కాగా, సాయంత్రం శ్రీశైలం జలాశయానికి 2,55,384 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏపీ పవర్‌హౌస్‌లో 30,762, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూ సెక్కులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అలాగే ఏ డు గేట్ల నుంచి 1,94,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.43 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.