పాలమూరు, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలకు ముగ్గుల పో టీలు నిర్వహించారు. పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు అర్జున్‌కుమార్, కృష్ణయ్య, గాలెన్న, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పా ల్గొన్నారు. అలాగే మహబూబ్‌నగర్ మండలం కోటకదిరలో సర్పంచ్ మల్లు రమ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ లు నిర్వహించారు. పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీకాంత్రాం, బుక్‌కీపర్ సావిత్రి, కారోబార్ మమత తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన క్రీడాపోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ చెన్నకిష్టన్న, మున్సిపల్ కమిషనర్ నూరుల్‌నజీబ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్వో ప్రశాంతి, ఆర్ఐ వెంకటేశ్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, అజీజ్, అశోక్‌గౌడ్, గడ్డం రాములు, బోరిం గ్ నర్సింహులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, ఆగస్టు 19 : మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ముగ్గు ల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఎం మాల్యానాయక్, ఎంపీవో జగదీశ్, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఆగస్టు 19 : మండల మహిళా సమాఖ్య ఆ ధ్వర్యంలో మండలకేంద్రంలో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాంతమ్మ, మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఎంపీడీవో సాయిలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ గీత, ఏపీఎం రాందాసు, ఎంపీ వో అనురాధ, ఐకేపీ సీసీ యాదమ్మ, ప్రకాశ్ ఉన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన మహిళలకు ఎంపీడీవో జయరాం, ఎస్సై శ్రీనయ్య, సర్పంచ్ కృష్ణయ్య బహుమతులను అందజేశారు. అదేవిధంగా స్థానిక సివి ల్ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆంజనేయులు, ఏపీఎం సునీత, సీసీలు మల్లేశ్, భద్రూనాయక్, నరేశ్, కేశవులు, కవిత, వెంకటేశ్, డాక్టర్ చంద్రశేఖర్, ఏపీవో నర్సయ్య, లక్కీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.