వనపర్తి (నమస్తే తెలంగాణ), ఆగస్టు 19 : మండలంలోని పెద్దగూడెం ఖాన్ చెరువు వరకు 9.350 కిలోమీటర్ల నూతన కాలువ నిర్మాణానికి రూ.18.66 కోట్లకు పరిపాలనా అనుమతులతో 254-జీవోను ప్రభుత్వం విడుదల చే సిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవాం ప్రకటనలో తెలిపారు. ఎంజీకేఎల్ఐ ప్యాకేజీ 29 కింద సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయపల్లి, దవాజిపల్లి గ్రా మాల్లో 5 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదన్నారు. ప్రధాన కాల్వ కింద డీ-8 డిస్ట్రిబ్యూటరీ కాల్వలో భాగంగా నిర్మించిన ఎంజే-4 కాల్వ పొడిగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేఎల్ఐ డీపీఆర్ తయారు చేసినప్పుడు వనపర్తి, ఘణపురం, పెద్దమందడి మండలాల ను చేర్చలేదని, అందుకే ఈ ప్రాంతానికి నీటి కేటాయింపులు జరుగలేదన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో ఈ వి షయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సాగునీ రు అందించాలన్న ఉద్దేశంతో వనపర్తి, ఘణపురం, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి మండలాలను ఎంజీకేల్ఐ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించామన్నారు. దాని ఫలితంగానే ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఘణపురం మండలానికి, బుద్ధారం బ్రాంచ్ కెనాల్ ద్వారా పెద్దమందడి మండలానికి, డిస్ట్రిబ్యూటరీ-5 నుంచి రేవల్లి మండలానికి, డిస్ట్రిబ్యూటరీ-8 నుంచి గోపాల్పేట, వనపర్తి మండలాలకు సాగునీరు అందించామన్నారు. గతంలో ఎంజే-4 కాల్వను గోప్లాపూర్, దవాజీపల్లి వరకు తవ్వి వదిలేశారన్నారు. వనపర్తి మండలానికి సాగునీరు తీసుకురావాలన్న కాలువ 16.40 కిలోమీటరు నుంచి మరో 9.350 కిలోమీటర్లు నూతనంగా తవ్వనున్నారని వివరించారు. కొత్త కాల్వ ద్వారా మరో 5 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రా నుండడంతోపాటు 10 చెరువులకు నీరు చేరనున్నదన్నారు. తాజా ఉత్తర్వులతో వనపర్తి మండలం సాగు నీ టితో సస్యశ్యామలం కానున్నదని పేర్కొన్నారు. నూతన కాల్వ నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.