అచ్చంపేట, ఆగస్టు 3: పేదరికంలో పుట్టడం అదృష్టంగా భావించాలని, యువత తలుచుకుంటే చరిత్రను సృష్టించవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో అచ్చంపేట ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు మూడు నెలలుగా కొనసాగుతున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. శిక్షణతో పాటు అందరికీ మధ్యాహ్న భోజనం, ఉచితంగా మెటీరియల్ కూడా అందజేశారు.
ఈమేరకు బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో శిక్షణ పొందిన యువతి, యువకులు విప్, ఎమ్మెల్యే, జీబీఆర్ ట్రస్టు చైర్ పర్సన్ గువ్వల అమలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడుతూ బాగా చదువుకొని సివిల్స్ సాధించాలనే సత్తా ఉండే వారికి అవసరమైతే తన సొంత ఖర్చుతో ఢిల్లీలో కోచింగ్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో సింహభాగం అచ్చంపేట ప్రాంత యువత సాధించాలనే తపనతో శిక్షణ శిబిరాన్ని కొనసాగించినట్లు చెప్పారు.
తన జీవితం ప్రజాసేవకు అంకితం చేశానని చెప్పారు. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొని వచ్చానని రోజుకు 3-4 గంటల కన్న ఎక్కువ నిద్రపోయేవాన్ని కాదనన్నారు. గువ్వల అమల మాట్లాడుతూ యువత పోటీ పడి ఉద్యోగాల్లో రాణించాలన్నారు. మూడు నెలల పాటు కోచింగ్ అందించిన హైదరాబాద్‌కు చెందిన మేధా కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీకి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ శైలజారెడ్డి, బీఎస్ఎన్ఎన్ విశ్రాంత ఉద్యోగి నర్సింహారావు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
వంగూరు, ఆగస్టు 3: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం వంగూరు మండలంలోని జాజాల గ్రామానికి చెందిన సుమారు 15మంది కాంగ్రెస్ పార్టీ యువకులు అచ్చంపేటలోని క్యాంపు కార్యాలయంలో విప్ గువ్వల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శ్రీకాంత్, రాముడు, బాలస్వామి, శివ, పవన్, రామకృష్ణ, పరశురాములు, అనిల్‌తో పాటు మరో పది మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌రెడ్డి, సైదులు పాల్గొన్నారు.