పెబ్బేరు, ఆగస్టు 3: అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు ఆవరణలో రూ.99 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్, పబ్లిక్ టాయిలెట్స్, సీసీ రోడ్లు, వే బ్రిడ్జిలను కలెక్టర్ యాస్మిన్‌బాషా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగరాయి శ్యామలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు అధునాతన సౌకర్యాలతో కూడిన వసతులు కల్పిస్తామన్నారు.
రాబోయే రోజుల్లో పెబ్బేరు మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేసే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని తెలిపారు. సమన్వవయం పాటించాలని పాత, కొత్త అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూర్చే విధంగా కృషి చేస్తామన్నారు. వ్యవసాయ మర్కెట్ అభివృద్ధి కోసం పరితపించి కృషి చేసిన మార్కెట్ కమటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మర్కెటింగ్ శాఖ జేడీ ఇఫ్తేకర్ నజీబ్ అహ్మద్, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వర్ణసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ గాయిత్రి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ కుమార్‌రెడ్డి, డైరెక్టర్లు బలరాంనాయుడు, బత్తుల భారతిగౌడ్, సంబు రాముశెట్టి, రాముడు, జలీల్, విష్ణు, శ్రీనివాసులు, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు సేవ చేయడం వరం
మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలకు సేవ చేయడం గొప్ప వరమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన సరోజిని మల్టీ స్పెషాలిటీ దవాఖానను కలెక్టర్ యాస్మిన్ బాషా, జెడీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 24గంటల సర్వీసుతో అన్ని రకాల వైద్య సేవలతో పెబ్బేరులో దవాఖాన ఏర్పాటు చేయడం శుభ సూచికమన్నారు. కార్యక్రమంలో ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, డీసీసీబీ డైరెక్టర్ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ గాయత్రి పాల్గొన్నారు.