దేవరకద్ర, నవంబర్ 27: టీఆర్ఎస్ పార్టీ కార్యకరలు సైనికుల్లా పనిచేయాలని పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పార్టీ మండల కార్యకర్తల విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా జెట్టి నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్‌భగీరథ, దళితబంధు, సీఎం సహాయనిధి, ఆసరా పింఛన్లు అందిస్తున్నారని వివరించారు. ప్రతి గ్రామంలోప్రజలకు ప్రభు త్వ పథకాలను పార్టీ కార్యకర్తలు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఓటరు లిస్టులో ఏమైనా మార్పు లు, చేర్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. 18ఏండ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మం డల అధ్యక్షుడు శ్రీకాంత్యయాదవ్, నాయకలు రంగయ్యగౌడ్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, కౌకుంట్ల శ్రీకాంత్, తు మ్మల శేఖర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, స్వామి, కోట్ల భాస్కర్‌రెడ్డి, శివరాజ్, శివానంద్, వెంకటేశ్, బాలస్వామి, మహబూబ్అలీ, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.