బిజినేపల్లి, జూన్ 15 : రైతుల పొలాలకు సాగునీరందించడమే లక్ష్యంగా మార్కండేయ రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్‌కు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు.
రూ.కోటితో నిర్మించిన మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరందిస్తుందని చెప్పారు. బిజినేపల్లి మండలంలోని ఎత్తు ప్రాం తాలకు సాగునీరందించేందుకు మార్కండేయ రిజర్వాయర్ నిర్మిస్తున్నామన్నారు. మం డల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగసభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ బాలరాజుగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు పులేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.