ఊట్కూర్, జూన్ 15 : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప అన్నారు. మండలంలోని ఊట్కూర్, కొత్తపల్లి, తిప్రాస్‌పల్లి తదితర గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో గ్రామీణ క్రీడా మైదానానికి స్థల పరిశీలన చేశారు. రెండు రోజుల్లో క్రీడా ప్రాంగణం పనుల ను పూర్తి చేసి విద్యార్థులు, యువతకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
క్రీడలతో విద్యార్థులు శారీరక దృఢత్వంతో ఉంటారన్నారు. మండలకేంద్రంలో నర్సరీలో మొ క్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని వన సంరక్షకులకు సూ చించారు. తిప్రాస్‌పల్లి, బాపురం గ్రామాల్లో అంతర్గత రోడ్లపై మట్టితో గుంతలను పూడ్చి వర్షం నీరు నిల్వ లేకుండా చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, సుమంగళ, ఎంపీటీసీ రవికుమా ర్, కార్యదర్శి సుమలత, ఉపాధి ఏపీవో కాళప్ప, ఈసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, జూన్ 15 : ప్రతిఒక్కరూ ఆరు మొక్కలు నా టాలని కౌన్సిలర్ ఇర్ఫానా అన్వర్ హుస్సేన్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రతి కుటుంబానికి కౌన్సిలర్ ఆరు మొక్కలను బుధవా రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వా ర్డు అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రతి పని చేస్తున్నామని తెలిపారు.
వార్డు కమిటీ సభ్యులు ప్రజల ఇబ్బందుల ను తెలుసుకొని పని చేస్తున్నామన్నారు. వార్డులో పాత ఇండ్లను తొలగించడం, ఖాళీ ప్లాట్లలో చెత్తాచెదారాన్ని ఏరివేయడం, గుం తలను పూడ్చడం, ముళ్లపొదలను తొలగించడం వంటి పనులు నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో వార్డు స్పెషల్ అఫీసర్ నగేశ్కుమర్, ఆర్పీ నఫీ మున్నిసాబేగం పాల్గొన్నారు.
కోస్గి, జూన్ 15 : మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమం బుధవారం ముమ్మరంగా సాగుతున్న ది. మండల ప్రత్యేకాధికారి, అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం జో రుగా కొనసాగుతున్నది. దీంతో పట్టణాలు, పల్లెల రూపురేఖలు మారుతున్నాయి.
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 15: పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో, వార్డు ప్రత్యేక అధికారి ఉషారాణి అ న్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మ హబూబ్‌నగర్ 5వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించా రు. వర్షాకాలం సమీపిస్తున్నందున పారిశుధ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆమె వెంట అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మిడ్జిల్, జూన్ 15: గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలని ఎంపీడీవో సాయిలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంతోపాటు వాడ్యాల్, మల్లాపూర్, బోయిన్పల్లి, చిల్వేర్ తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో అనురాధ, సర్పంచులు రాధికారెడ్డి, మంగమ్మ, జంగిరెడ్డి, నారాయణరెడ్డి, సంయుక్తరాణి, పంచాయతీ కార్యదర్శులు సాయన్న, ప్రశాంత్, శ్రీనివాసులు, ఇమ్రాన్, మధుకుమార్ పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 15 : మండల కేంద్రంతో పాటు పెద్దాయపల్లి, వాయిల్‌కుంటతండా, ఊటుకుంటతండా, బోడగుట్టతండా, నేరళ్లపల్లి, సూరారం తదితర గ్రామాల్లో పల్లెప్రగతి ప నులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా పలు వార్డుల్లో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు, మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు గోపీనాయక్, రమేశ్‌నాయక్, శంకర్, లలిత పాల్గొన్నారు.
గండీడ్, జూన్ 15 : పల్లె ప్రగతితో గ్రామాల్లో రూ పురేఖలు మారిపోయాయని ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని పెద్దవార్వాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. హ రితహారంలో మొక్కలు నాటి సంరక్షించుకునే బాధ్య త తీసుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి హంసా, ఏఎన్ఎం అరుణ, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు మధుమతి, ఆశ వర్కర్లు మంగమ్మ, తి రుపతమ్మ పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 15 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను బోధిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి మున్నీ అన్నారు. బుధవారం మండలంలో ని తాటికొండ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని తాగునీటి సరఫరా, నర్సరీ, రైతు వేదిక, హరితహారంలో నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, బడిబయటి పిల్లల వివరాలను తీసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సాయిబాబా, ఎంపీవో విజయకుమా ర్, సర్పంచ్ సాయిబాబా, ఎంపీటీసీ సాయిలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్న హరితహారం కార్యక్రమానికి మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్తం కావాలని మండల ప్రత్యేక అధికారి, డీసీవో సుధాకర్ సూచించారు. మండలంలోని మల్లారెడ్డిపల్లి, కూచూర్ గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులను డీసీవో సుధాకర్ బుధవారం పరిశీలించారు. మం డలంలోని కారుకొండ, తీగల్‌పల్లి గ్రామాల్లో చేపడుతున్న క్రీడాప్రాంగణాల పనులను ఎంపీడీవో శ్రీలత పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీవో జ్యోతి, టీఏలు పాల్గొన్నారు.
జడ్చర్ల, జూన్ 15 : పల్లెప్రగతి పనులు జడ్చర్ల మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మండలంలోని గ్రామాల్లో మొక్కలకు గుంతలు తీసేకార్యక్రమం కొనసాగింది. అంబటిపూర్లో సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను చేపట్టారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలకు పాదులు చేశారు. శ్మశానవాటిక ఆవరణలో హరితహారంలో మొక్కలు నాటేందుకు గుంతలు తీశారు. అల్వాన్‌పల్లిలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, శ్మశానవాటిక, సెగ్రిగేషన్షెడ్లను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు నర్సింహులు, విజయలక్ష్మి, రాములునాయక్, గాంగ్యానాయక్, రాజేశ్వర్‌రెడ్డి, అరుణాసత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, కుర్వపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.