మహబూబ్‌నగర్, జూన్ 15 : అందరం కలిసిమెలి సి మహబూబ్‌నగర్ అభివృద్ధిలో పాలుపంచుకుందామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ యార్డు గుమాస్తా సంఘం సభ్యులు దాదాపు 100 మంది మం త్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాటాడుతూ ఏండ్ల తరబడి దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ నాయకులతో ఎలాంటి ఉపయోగం లేదని గమనించిన ఆయా పార్టీల నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు.
అందరి కుటుంబానికి ఇంటి పెద్ద దిక్కుగా నేనుంటానని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్‌ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ ప్రజలు తలెత్తుకుని తిరిగేలా చేస్తామన్నారు. మంచి చేసే వారి వెంట ఉంటే మనకూ మంచి జరుగుతుందని స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన వారిలో గుమాస్తా సంఘం నేతలు ఓరుగంటి బాలాజి, వెంకట్‌రెడ్డి, బుక్క నర్సింహులు, అక్బర్అలీ, దేవరశెట్టి ప్రభాకర్, నరసింహారెడ్డి, నరేశ్, సత్యం, శంకర్, ఆంజనేయులు, తిరుపతిరెడ్డి, వేణుగోపాల్, రవీందర్‌తోపాటు వంద మంది ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.