మక్తల్ టౌన్, జూన్ 15 : దళితోద్ధరణ కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మక్తల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఏడు బొలేరో వాహనాలు, 13 ట్రాక్టర్లు, ఏడుగురికి డెయిరీ ఫాం ఏర్పాటుకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కింద కిరాణషాపు ఏర్పాటుకు మంజూరైన రూ.50 వేల చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ దేశంలో అన్ని స్కీంలలో కన్నా అతి పెద్ద నగదు బదిలీ పథకం ఇదేనన్నారు. నియోజకవర్గంలో మక్తల్, ఊ ట్కూర్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలాల్లో ఇప్పటివరకు 64 మందికి, అమరచింత, ఆత్మకూర్ పరిధిలో 36 మందికి లబ్ధి చే కూరిందన్నారు. ఈ ఆర్థిక సాయం ద్వారా దళితులు వరికోత మి షన్లు, ఆటో ట్రాలీలు, పాలు, కోళ్ల పరిశ్రమ వంటివి పెట్టుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హరినాథ్‌రెడ్డి, డీఏవో జాన్‌సుధాకర్, జెడ్పీటీసీ అశోక్, పార్టీ మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎంపీడీవో శ్రీధర్, టౌన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.