ఊట్కూర్, జూన్ 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన పక్షం రోజుల పల్లె ప్రగతి కార్యాచరణ క్షే త్రస్థాయిలో పటిష్ఠంగా అ మలు జరిగే విధంగా ప్ర త్యేకంగా శ్రద్ధ చూపాలని ఎంపీడీవో కాళప్ప అన్నా రు. మండలంలోని ఊ ట్కూర్, బాపురం తిప్రాస్‌పల్లి, మల్లేపల్లి, పులిమామిడి తదితర గ్రామాల్లో 15 రోజుల ప్రణాళిక ప నుల్లో భాగంగా ఆదివారం ప్రజాప్రతినిధులు, అ ధికారులు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మాల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొనే విధంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పాతపేట, తి ప్రాస్పల్లి గ్రామాల్లో రహదారులపై కల్వర్టుల ని ర్మాణం, మొర్రం మట్టితో మురుగు నీటి గుంతల ను పూడ్చి ప్రజల రాకపోకలకు రోడ్డ సౌకర్యం క ల్పించారు. బాపురంలో మహిళలు రోడ్లపై చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. రోడ్డు పక్కల ఉన్న ముళ్లపొ దలను తొలగించారు. ఆయా గ్రామాల్లో సర్పంచు లు సూర్యప్రకాశ్‌రెడ్డి, సుమంగళ, సూరయ్యగౌడ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, జూన్ 12 : పట్టణ ప్రగతితో ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ లో 16వ వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.లక్ష కేటాయించామని తెలిపారు. వాటితో అ భివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
చె త్తాచెదారం, గుంతలను పూడ్చడం, పాడుబడిన బావులను పూడ్చడం, ముళ్లపొదలను తొలగించ డం వంటి పనులు కొనసాగుతున్నాయన్నారు. 5 వ వార్డులో కౌన్సిలర్ మొగిలప్ప మున్సిపల్ కా ర్మికులతో నందినినగర్‌లో వాటర్ ట్యాంక్‌ను శు భ్రం చేయించారు. వార్డుల్లో కౌన్సిలర్లు ఆయా వా ర్డుకు కేటాయించిన వార్డు స్పెషల్ ఆఫీసర్లు, వార్డు కమిటీ సభ్యులు సూచించిన పనులను చేపడుతున్నారని ఆయన తెలిపారు.
కృష్ణ, జూన్ 12 : పరిసరాల పరిశుభ్రతను ప్ర తిఒక్కరూ పాటించాలని సర్పంచ్ మహదేవమ్మ సూచించారు. మండలంలోని గుడెబల్లూర్‌లో ఆదివారం పల్లె ప్రగతిలో భాగంగా పారుశుధ్య పనులను సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స ర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం, పారిశుభ్రతతో కళకళలాడేందకు ప్రత్యేక కార్యాచరణ తో పనులు చేపట్టడం జరిగిందన్నారు. కార్మికులు రోడ్లపై చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమం లో ఎంపీటీసీలు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.