ఊట్కూర్, జూన్ 11 : పార్టీలతో ప్రమేయం లేకుండా సర్పంచులు పోటీ పడి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నిడుగుర్తిలో శనివారం నిర్వహించిన పల్లె ప్రగతిలో అదన పు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చట్టంలో అనేక సంస్క రణలు తెచ్చిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా అమలు కావడం లేదని చెప్పారు.
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామం నుంచి జిల్లాకేంద్రానికి ఇటు మండలకేంద్రానికి వెళ్లేందుకు రూ.6 కోట్లతో బీటీ రో డ్డు సౌకర్యం కల్పించామన్నారు. గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, మినరల్ వాటర్ కేంద్రం నిర్మించినట్లు తెలిపారు. చదువుతోపాటు విద్యార్థు లు క్రీడల్లో రాణించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి పా ఠశాలకు క్రీడా ప్రాంగణం నిర్మిస్త్తుందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలపై ప్రోత్సహించాలన్నారు. అదనపు క లెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రహదారులను, మురుగు కాల్వలను నిరంతరం శుభ్రపర్చాలన్నారు. ప్రతి ఇంటి నుం చి తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులను పూర్తి చేయించాలని ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి మాధవిని ఆదేశించారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌తోపాటు కార్యదర్శిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
పల్లె ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ దా దాపు మూడు గంటలపాటు గ్రామంలో వార్డుల వారీగా ప ర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అం తర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సర్పంచ్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఎస్సీ కాలనీలో ప్రభు త్వ స్థలాన్ని పరిశీలించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులు చేపట్టి వెంటనే భవనాన్ని అందుబాటులోకి తెస్తామని ఎ మ్మెల్యే కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. నర్సరీలో మొక్కలను పరిశీలించి ప్రజలకు అవసరమైన అందుబాటులో ఉంచాలని ఈజీఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, ఎం పీడీవో కాళప్ప, సర్పంచ్ యుశోదమ్మ, ఎంపీటీసీ రాఘవరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షు డు సుధాకర్‌రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, మాజీ స ర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, సర్వేయర్ అశోక్‌గౌడ్, ఉపాధి ఈసీ శ్రీనివాసులు, వీఆర్ఏ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, జూన్ 11 : మండలంలోని జా జాపూర్, సింగారం, చిన్నజట్రం, బోయిన్పల్లి, అప్పిరెడ్డిప ల్లి, సింగారం, శాసన్‌పల్లి తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి ప నులు ముమ్మరంగా సాగుతున్నాయి. బోయిన్పల్లి, అప్పిరెడ్డిపల్లి, చిన్నజట్రం గ్రామాల్లో సాగుతున్న పనులను మం డల ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీవో సందీప్‌కుమార్, ఎంపీవో రాజు పరిశీలించారు. అప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చే యనున్న క్రీడా ప్రాంగణం కోసం స్థలం పరిశీలించారు. కా ర్యక్రమంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గ్గొన్నారు.
మరికల్, జూన్ 11 : పల్లె ప్రగతితో మరింత అభివృద్ధి జరుగుతున్నదని వైస్ ఎంపీపీ రవికుమార్ అన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలతోపాటు తాగునీటి, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. గ్రా మాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
దామరగిద్ద, జూన్ 11 : మండలంలోని గడిమున్కన్ప ల్లి, సజనాపూర్, మద్దెలబీడ్, క్యాతన్‌పల్లి తదితర గ్రామాల్లో శనివారం పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. గ డిమున్కన్పల్లి, సజనాపూర్ గ్రామాల్లో మురుగు కాల్వల పూడికతీత పనులు నిర్వహించారు. మద్లెబీడ్, క్యాతన్‌పల్లి గ్రామాల్లో రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించా రు. మండలకేంద్రంలో ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రో డ్లును శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీవో రామన్న, కార్యదర్శి రాజయ్యగౌడ్, సర్పంచులు ఆశమ్మ, జి.సుభాష్, కన్కప్ప, వెంకటప్ప, యువకులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, జూన్ 11 : పట్టణంలో పట్టణ ప్రగతి పనులు శనివారం ముమ్మరంగా కొనసాగాయి. పలు వార్డుల్లో కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారుల సమక్షంలో మురుగు కాలువలు శుభ్రం చేశారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు చేపట్టారు. జేసీబీల సహాయంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలను తొలగించారు. కార్యక్రమాలలో ఆయా వా ర్డుల కౌన్సిలర్లు అనిత, శిరీష, గురులింగప్ప, అమీరుద్దీన్తోపాటు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
కోస్గి, జూన్ 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న పల్లె, పట్టణ ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నా యి. కోస్గి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు శనివారం చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టి పనులు చేపట్టారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ఉదయం నుంచే పనులు చేపడుతున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ప ర్సన్ శిరీష్, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.