గోపాల్పేట, జూన్ 9 : మండల కేంద్రంలో గురువారం నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ఠ మ హోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రికి స్థానికులు ఘన స్వా గతం పలికారు. టీఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు. స్థానికులతో కలిసి బొ డ్రాయి వద్ద మంత్రి పూజలు చేశారు. గ్రామస్తులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, జెడ్పీటీసీ మంద భార్గవి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కోఆప్షన్ సభ్యులు మతీన్, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, గ్రామ అధ్యక్షుడు గుండ్రాతి రాజేశ్‌గౌడ్, నాయకులు కొత్త రామారావు, కోటీశ్వర్‌రెడ్డి, కాశీనాథ్, భాస్కర్, మన్యం నాయక్, రాజేశ్, నాగరాజు, గోపాల్, మహేశ్ పాల్గొన్నారు.