అచ్చంపేట, జూన్ 9 : గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీ డా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి అన్నారు. గురువారం పట్టణంలోని పదో వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి ప్రారంభించాలన్నారు. క్రీడా ప్రాంగణాల్లో నిత్యం యువత ఆటలు ఆడుకునేవిధంగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు పాల్గొన్నారు.
బల్మూరు, జూన్ 9 : గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతగా పని చేయాలని అదనపు కలెక్టర్ మ నూచౌదరి అన్నారు. గురువారం పల్లెప్రగతి ఐదో విడుతలో భాగంగా ఆయన మండలంలోని జినుకుంట గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నర్సరీ, ఉపాధి పనులను పరిశీలించా రు. మండలంలోని మహదేవ్పూర్, బల్మూరు, పోలిశెట్టిపల్లి, పోలెపల్లి, గట్టుతుమ్మెన్ గ్రామాల్లో సర్పంచులు, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ప్రజలతో కలిసి కాలనీల్లో పర్యటించారు. వైకుంఠధామలు, డంపింగ్యార్డు, మురుగుకాల్వలు, రోడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీవో దేవన్న, సర్పంచులు శ్రీరాంనాయక్, రమేశ్, రవిచంద్రారెడ్డి, ప్రియాంకగణేశ్, సువర్ణ, శివశంకర్, మయురి, నాగరాజు ఉన్నారు.