గ్రామాల్లో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు పరారవుతున్నాయి. కుక్కలు, పందులకు ఆవాసాలు లేకుండాపోవడంతోపాటు అపరిశుభ్రత దూరమవుతున్నది. నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ ఈ వ్యాధులు నమోదు కావడం లేదు. దోమ కాటుతో వచ్చే మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటీస్(జేఈ) వ్యాధి సింగిల్ డిజిట్లకే పరిమితమైంది. అలాగే కరోనా కంటే ముందు ఆందోళన కలిగించిన హెచ్-1 ఎన్-1 వైరస్ సంక్రమిత స్వైన్ ఫ్లూ సైతం దూరమైంది. దీనికి తోడు పల్లెలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తుండగా.. పట్టణాలు పారిశుధ్యానికి కేరాఫ్‌గా నిలిచాయి. 2019లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఐదో విడుత చేపడుతుండడంతో ఈ వానకాలంలోనూ సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. ‘ప్రగతి’కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
నాగర్‌కర్నూల్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి సత్ఫలితాలిస్తున్నది. గ్రామాలు, పట్టణాలు ఆరోగ్యకరంగా మారుతున్నాయి. గత రెండేండ్లుగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇంతకుముందు సీజనల్ వ్యాధులతో భయపడిన ప్రజలు ఇప్పుడు వాటిని మర్చిపోయారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు విడుతలుగా పారిశుధ్య పనులు చేపట్టింది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ వంటి ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఆర్డీవో, డీపీవో వంటి ఉన్నతాధికారులు పాల్గొనడంతో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. ఇండ్ల మధ్య మురుగు గుంతలు లేకుండా మట్టి వేసి చదును చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తున్నారు. ఇండ్లు, రోడ్ల వెంట మొలిచిన పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. నీటి ట్యాంకుల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ ట్యాంకులను తరచూ శుభ్రం చేస్తున్నారు.
ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీరుతున్నది. పంచాయతీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేయడంతోపాటు తడి, పొడి చెత్తను ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ ద్వారా నిత్యం సేకరించి డంపింగ్ యార్డులకు చేరవేస్తున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో, ఇండ్ల మధ్య చెత్త కుప్పలు కనిపించడం లేదు. దీంతో కుక్కలు, పందుల బెడద తప్పింది. ఇలా పల్లె ప్రగతితో గ్రామాల్లో అపరిశుభ్రత దూరమవుతున్నది. ఫలితంగా ప్రతి వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధు లు సైతం దూరమయ్యాయి.
నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ ఈ వ్యాధులు నమోదు కాకపోవడం విశేషం. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటీస్(జేఈ) వ్యాధిగ్రస్తులు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. అలాగే కరోనా కంటే ముందు ఆందోళన కలిగించిన హెచ్1ఎన్1 వైరస్ సంక్రమిత స్వైన్‌ఫ్లూ సైతం దూరమైంది. ఇక కలుషిత నీటి సంక్రమిత అతిసా ర, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులూ భారీ గా తగ్గుముఖం పట్టాయి. వాటర్‌ట్యాంకుల వద్ద మురుగు తొలగించడం, నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం సరఫరా అవుతుండడం ప్రధాన కార ణం. ఫలితంగా పల్లెలు ఆరోగ్యంగా మారాయి. వీటితోపాటు పిచ్చిమొక్కలు, పాడుబడ్ల ఇండ్లు, బావులు తొలగించడంతో పాములు, తేళ్లలాంటి విషపురుగుల సంచారం తగ్గింది. ఇలా పల్లె ప్రగతితో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి.
ఈ ఏడాది ఇప్పటివరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక్క డెంగీ కేసు తప్పా ఎలాంటి సీజనల్ వ్యాధులు రాలేదు. ఫైలేరియా కేసులు 2018లో 122 నమోదు కాగా.. ఆ తర్వాత ఒక్కరికీ ఈ వ్యాధి రాలేదు. జేఈ వ్యాధి 2019లో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. స్వైన్ ఫ్లూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 2021లో 12 విరేచనాలు కేసు లు, ఈ నాలుగేండ్లల్లో టైఫాయిడ్ కేసులు ఐదు మాత్రమే నమోదయ్యాయి. అతిసార కేసులు ఆందోళనకరంగా కనిపించినా.. వ్యాధి తీవ్రత బాగా తక్కువ. మామూలు లక్షణాలతోనే ప్రజలు కోలుకున్నారు. పాము, కుక్కకాటు, అతిసార, విరేచనాలు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎవరూ గురికాలేదు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు భారీగా తగ్గాయి. గ్రామాల్లో చెత్త వేయకుండా, మురుగు నీరు నిల్వకుండా చర్య లు తీసుకున్నారు. నీరు కలుషి తం కాకుండా బ్లీచింగ్ పౌడర్ చ ల్లడం, దోమలు నిల్వ ఉండకుం డా తీసుకున్న చర్యలే దీనికి కార ణం. స్వైన్‌ఫ్లూ, డెంగీ, చికున్ గు న్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు చాలా వర కు తగ్గాయి. ఒక్క కరోనా కేసులతో మాత్రమే గత మూ డేండ్లుగా ప్రజలు చికిత్స తీసుకుంటున్నారు.
– సుధాకర్లాల్, డీఎంహెచ్‌వో, నాగర్‌కర్నూల్