కృష్ణ, జూన్ 9 : గొర్రెలు, మేకల ఆరోగ్యంపై కాపరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల పశు వైద్యాధికారి వంశీకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గుడెబల్లూర్‌లో గొ ర్రెలు, మేకలకు గురువారం నట్టల నివారణ మందులు పం పిణీ చేశారు. అవకాశాన్ని పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పశు పోషకులు పాల్గొన్నారు.
మాగనూర్, జూన్ 9 : జీవాలకు నట్టల నివారణ మం దు తప్పనిసరిగా వేయించాలని పెంపకందారులకు పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. మండలంలోని వడ్వాట్, అమ్మపల్లి గ్రామాల్లో గొర్రెలు, మే కలకు గురువారం నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు నర్సింహులు, పద్మమ్మ, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గ్గొన్నారు.
ఊట్కూర్, జూన్ 9 : పశువులను సీజనల్ వ్యాధుల నుంచి సంరక్షించుకోవాలని వీఏఎస్ మహదేవ్ సూచించా రు. మండలంలోని ఓబ్లాపూర్‌లో గొర్రెలు, మేకలకు గురువారం నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. మండలంలో ని అన్ని గ్రామాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
మరికల్, జూన్ 9 : మండలంలోని జిన్నారంలో గురువారం గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశా రు. కార్యక్రమానికి సర్పంచ్ భాస్కర్ హాజరై మందులు పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిరెడ్డి, గొర్ల కాపరుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మిడ్జిల్, జూన్ 9 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయడంతో సీజనల్ వ్యాధులు సోకవని పశువైద్యాధికారి శ్రావణి అన్నారు. మండలకేంద్రంతోపాటు మున్ననూర్, మసిగుండ్లపల్లి, మల్లాపూర్, చిల్వేర్ గ్రామాల్లో గురువారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గౌస్, రాజిరెడ్డి, సర్పంచులు సునీత, సుమతమ్మ, సంయుక్తారాణి పాల్గొన్నారు.
మూసాపేట, జూన్ 9 : మండలంలోని నిజాలాపూర్, మహ్మదుస్సేన్‌పల్లి గ్రామాల్లో గురువారం జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. మొత్తం 5,195 గొర్రెలు, 300 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు వెటర్నరీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు గడ్డమీది సత్యమ్మ, నిర్మలాకాశీనాథ్, గొర్రెలకాపరుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, మొగులయ్య తదితరు లు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, జూన్ 9 : మండలంలోని గూరకొం డ, బస్వాయిపల్లి, అజిలాపూర్, రేకులంపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు వెటర్నరీ డాక్టర్ జీసన్‌అలీ తెలిపారు. మొత్తం 14,860 గొర్రె లు, 832 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 9 : మండలంలోని అమిస్తాపూర్, పోతులమడుగు గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందు వేసినట్లు మండల పశువైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. ఆయా గ్రామాల్లో 9,217 గొర్రెలు, 730 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, జూన్ 9 : మున్సిపాలిటీలోని 2వ వార్డులో కౌన్సిలర్ బుక్క మహేశ్ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ జీవాల ఆరోగ్య సంరక్షణకు తప్పనిసరిగా నట్టల నివారణమందు వేయించాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యశాల ఇన్చార్జి ఆశారాణి రమేశ్‌యాదవ్, సుధాకర్, శాంతయ్య, వెంకటయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.