మక్తల్ టౌన్, జూన్ 9 : వార్డు అభివృద్ధ్దికి ప్రజల భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. మక్తల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా 7వ వార్డులో ఎమ్మెల్యే చిట్టెం పర్యటించారు. వార్డు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పట్టణాలు, పల్లెలు పరిశుభ్రంగా ఉం డాలని, మంచి వాతావరణం ఏర్పడాలని, పచ్చని చెట్లతో కళకళలాడాలని కోరుకుంటున్నారని, పట్టణ, పల్లె ప్రగతితో తెలంగాణ ముందుకుపోవాలన్నారు. ముఖ్యంగా 7, 9వ వార్డుల్లో చేయవాల్సిన పనులు అధికంగా ఉన్నాయన్నారు. వారుల్లో ప్రజలు సూచించిన పనులను త్వరగా పూర్తి చే యాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారు లు, వార్డు ప్రత్యేకాధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కోస్గి, జూన్ 9 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలంలోని ముశ్రీఫాలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను గురువారం జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ ఎమ్మెల్యే పట్నం, అదనపు కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలతోపాటు పరిసరాల పరిశుభ్రతపై చర్చించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు డ్వాక్రా భవనం కా వాలని కోరడంతో జెడ్పీ చైర్పర్సన్ జెడ్పీ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ భవనం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ మొగులయ్య, ఎంపీటీసీ పోష్యప్ప, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జూన్ 9 : గ్రామాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టి కృషితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి సిద్ధి రామప్ప అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఊట్కూర్, మొ గ్దుంపూర్, తిప్రాస్‌పల్లి గ్రామాల్లో గురువారం పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. 15 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలను మార్చాలని సూచించారు. ఆయా గ్రామాల్లో నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. గ్రామాల్లో మహిళా సంఘాల స భ్యులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది స్వ చ్ఛందంగా పాల్గొని రోడ్లపై చె త్తను ఊడ్చి శుభ్రం చేశారు. మొక్కలకు నీళ్లు పట్టి, పిచ్చి మొక్కలను తొలగించారు. తిప్రాస్‌పల్లిలో సర్పంచ్ సుమంగళ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది పాఠశాల గోడలకు బూజు దులిపి శుభ్రం చేశారు. కార్యక్రమం లో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డి, ప్రత్యేకాధికారులు రాఘవేంద్రారెడ్డి, కొండన్న, కా ర్యదర్శులు పాల్గొన్నారు.
మక్తల్ రూరల్, జూన్ 9 : మండలంలోని పం చలింగాలలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం క్రీడా ప్రాంగ ణం నిర్మాణ పనులను మండల ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్ ప్రారంభించారు. పాఠశాల మైదానంలో జేసీబీతో నేలను చదును చేశారు. అనంత రం ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, లాంగ్ జంప్ క్రీడలకు కోర్టులను ఏర్పాటు చేయడానికి మార్కింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఎం పీవో పావని, ఏపీవో గౌరీశంకర్, సర్పంచ్ తిక్క మ్మ, ఉపసర్పంచ్ బీరప్ప, విద్యా కమిటీ చైర్మన్ వెంకటప్ప, గ్రామ ప్రత్యేకాధికారి మణికంఠ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీంరెడ్డి, కార్యదర్శి రాము, టెక్నిల్ అసిస్టెంట్ గౌస్, పీఈటీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, జూన్ 9 : మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. గురువారం మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో సాగుతున్న పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి జ్యోతి, కొల్లంపల్లిలో ఎంపీడీవో సందీప్‌కుమార్, జిలాల్పూర్లో గ్రామ ప్రత్యేకాధికారి ఎంపీవో రాజు వివిధ పనులను పరిశీలించారు. ఊటకుంటతండా, జాజాపూర్‌లో గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీ శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాగనూర్, జూన్ 9 : గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి పెంచాలని డీపీవో మురళి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని నేరడగంలో వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను గురువారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి నిర్వహిస్తుందని, ఎక్కడైనా నిరక్ష్యం వహిస్తే చ ర్యలు తప్పవని డీపీవో హెచ్చరించారు. కార్యదర్శి మురు గు కాలువలు శుభ్రం పర్చడం, పిచ్చి మొక్కలు తొలగించ డం వంటి పనులు వేగవంతంగా చేయించాలన్నారు.
మరికల్, జూన్ 9 : మండలంలోని రాకొండలో పల్లె ప్ర కృతి వనాన్ని గురువారం మండల ప్రత్యేక అధికారి గోపాల్‌నాయక్ పరిశీలించారు. అలాగే క్రీడా ప్రాంగణానికి స్థలం లేదని అధికారులు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, ఏసీవో చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్ శివకుమార్, సర్పంచ్ రాజు, కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.