నవాబ్‌పేట, జూన్ 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండలంలోని హజిలాపూర్, మల్కాపూర్, నవాబ్‌పేట, కాకర్లపహాడ్ గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను గురువారం తనిఖీ చేశారు. మొదట హజిలాపూర్‌లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. మల్కాపూర్‌లో హరితహారం మొక్కలను పరిశీలించి నీరు పోశా రు. గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. నవాబ్‌పేటలో పారిశుధ్య పనులను పరిశీలించారు. కాకర్లపహాడ్‌లో క్రీడాప్రాంగణం పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రూనాయక్, ఏపీవో జ్యోతి, సర్పంచులు గంగమ్మ, సుధాకర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, పాశం జంగమ్మ, పంచాయతీ కార్యదర్శులు బుచ్చన్న, నరేందర్, నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, జూన్ 9 : పట్టణప్రగతి కార్యక్రమంతో జడ్చర్ల పట్టణం మరింత అభివృద్ధి చెందుతున్నదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని 1, 2 వార్డుల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్ల తొలగిం పు, మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలతోపా టు తాగునీటి, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో మొక్కలను నాటారు. అలాగే 24వ వార్డులో కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నారాయణ పాఠశాల వద్ద చెరువుకట్ట పొడవునా మొక్కలు నాటేందుకు గుంతలు తీశారు. కాలనీలో డ్రైనేజీ, మిషన్‌భగీరథ పైపులైన్ పనులను ప్రా రంభించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సారిక, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు బుక్క మహేశ్, షాహిమీనాజ్, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, బాబా, రామ్మోహన్, జీనురాల సత్యం, బుచ్చయ్య, రవికుమార్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, బాలశంకర్, శ్రీనాథ్‌రెడ్డి, రాధాకృష్ణ, వెంకటేశ్‌గౌడ్, సంతోష్‌నాయక్, ప్రమీల, శ్రీలత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
గండీడ్, జూన్ 9 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కా ర్యక్రమంతో పల్లెలన్నీ శుభ్రంగా మారాయని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని పగిడ్యాల్, బల్సుర్‌గొండ, మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల, ఎల్కిచెరువు తండాల్లో అధికారులతో కలిసి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. పల్లెప్రగతిలో భాగంగా బల్సుర్గొండలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగించడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించి మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి దశరథ్, ఎంపీడీవో రూ పేందర్‌రెడ్డి, సర్పంచ్ వనజ, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 9 : పట్టణప్రగతి కార్యక్రమంలో గుర్తించిన ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రామయ్యబౌలిలో మేజర్ డ్రైనేజీలో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో పారిశుధ్యం లోపించకుండా చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు.పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కా ర్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కోయిలకొండ, జూన్ 9 : గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎల్పీవో వరలక్ష్మి అన్నా రు. మండలంలోని అనంతాపూర్, దమాయపల్లి, పారుపల్లి, ఇబ్రహీంనగర్, కోయిలకొండ గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, హరితహారం మొక్కలను చూశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లో పల్లెప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. అందరి సహకారంతో ప్రణాళికాబద్ధంగా పల్లెప్రగతి పనులను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, ఎంపీవో నసీర్‌అహ్మద్, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సర్పంచులు బీ.కృష్ణయ్య, హన్మంతు, మాణిక్యమ్మాయాదయ్య, రాములు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్, జూన్ 9 : మండలంలోని దివిటిపల్లిలో పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నా యి. అన్ని కాలనీల్లో డ్రైనేజీలను శుభ్రం చేయడంతోపా టు పిచ్చిమొక్కల తొలగింపు పనులు చేపట్టారు. గ్రా మంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను సర్పం చ్ జరీనాబేగం పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరలింగం పాల్గొన్నారు.
జడ్చర్ల, జూన్ 9 : జడ్చర్ల మండలంలో పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. మాచారం బూర్గుపల్లి, గొల్లపల్లి, ఈర్లపల్లి, నసరుల్లాబాద్, కోడ్గల్, లింగంపేట, ఆలూరు తదితర గ్రామాల్లో మురుగుకాల్వలను శుభ్రం చేశారు. అలాగే పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూచించారు. అలాగే వి ద్యుత్ లైన్లను సరిచేశారు. బూర్గుపల్లి, ఆలూరు గ్రామా ల్లో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సీఈవో జ్యోతి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే బడిబాట కార్యక్రమంలో పాల్గొని బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అనంత రం మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్‌రెడ్డి, చంద్రకళ, విజయలక్ష్మి, భారతి, రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చేతన, నర్సింహులు, శ్రీనివాసు లు, కృష్ణకుమార్, సుకన్య, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీ వో జగదీశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరె డ్డి, సలోమి, ఏఈవో నాగేశ్వరి, కొండల్, రాజు, నాగ య్య, ఉపసర్పంచ్ నాగమ్మ, యాదయ్య పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 9 : మండలంలోని పెద్దాయపల్లిలో పల్లెప్రగతి పనులను ఉత్సాహంగా నిర్వహించారు. అంతర్గతరోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి డ్రైనేజీలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
మిడ్జిల్, జూన్ 9 : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోడ్లుకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించారు. అలాగే హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు గుంతలను తీశారు. పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో సాయిలక్ష్మి పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 9 : మండలంలోని కొత్తూర్‌లో మండల ప్రత్యేకాధికారి సాయిబాబా పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, ఎంపీవో విజయకుమార్, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.